నాని క‌ష్టం బూడిద‌లో పోసిన క‌న్నీరే..!

Last Updated on by

అదేంటి.. ప‌న్నీరా అంటారు క‌దా.. క‌న్నీరు ఏంటి అనుకుంటున్నారా..? మ‌రి ఇక్క‌డ ఇదే జ‌రుగుతుంది క‌దా. నాని అంత‌గా క‌ష్ట‌ప‌డుతున్నాడు బిగ్ బాస్ 2 రేటింగ్స్ మాత్రం బాగా రావ‌డం లేదు. ఒక‌ప్పుడు ఎన్టీఆర్ సంచ‌ల‌నాలు సృష్టిస్తే ఇప్పుడు నాని బిగ్ బాస్ ను కాపాడ‌లేక‌పోతున్నాడు. ఎన్ని చేసినా ఈ రేటింగ్స్ మాత్రం రావ‌డం లేదు. దాంతో షో నిర్వాహ‌కుల‌కు కూడా ఏం చేయాలో పాలు పోవ‌డం లేదు. ఇంకా పాతిక రోజులు కూడా కాలేదు అప్పుడే ఇలా ఉంటే.. మ‌రో 75 రోజులు ఎలా ఉండ‌బోతుందో ఊహించుకుంటేనే వాళ్ల‌కు వ‌ణుకు మొద‌ల‌వుతుంది. తొలివారం బాగానే వ‌చ్చిన టిఆర్పీ.. రెండో వారానికి వ‌చ్చేస‌రికి ఢ‌మాల్ అని ప‌డిపోయాయి. దానికితోడు షోలో కాంట్ర‌వ‌ర్సీలు కూడా ప్రేక్ష‌కుల మెప్పు పొంద‌లేకపోతున్నాయి.

మొద‌ట్నుంచీ ఉన్న బ్యాడ్ ఒపీనియ‌న్ బిగ్ బాస్ కు షాపంగా మారుతుంది. నిర్వాహ‌కులు ఎంత ప్ర‌య‌త్నించినా రేటింగ్స్ ద‌గ్గ‌రికి వ‌చ్చేస‌రికి తేలిపోతున్నాడు బిగ్ బాస్ 2. నాని కూడా దీనికి ప‌రిష్కారం క‌నిపెట్ట‌లేక‌పోతున్నాడు. అన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టి షో చేస్తుంటే దానికి స‌రైన రేటింగ్ రాన‌పుడు ప‌డే బాధ మామూలుగా ఉండ‌దు. ఎన్టీఆర్ సెట్ చేసిన స్టాండ‌ర్డ్స్ అందుకోవ‌డంలో నాని స‌క్సెస్ అవుతున్నాడు కానీ షో మాత్రం స‌క్సెస్ కావ‌డం లేదు. దాంతో అస‌లుకే మోసం వ‌స్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ కు వ‌స్తోన్న రేటింగ్ కూడా నాని వ‌చ్చిన‌పుడే. మిగిలిన రోజుల్లో పూర్తిగా సీరియ‌ల్స్ బిగ్ బాస్ ను తినేస్తున్నాయి. మ‌రి ఈ బాధ నుంచి మా యాజమాన్యం ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారో..!

User Comments