ఇంత‌కీ నాని చేసిన త‌ప్పేంటి..?

Last Updated on by

ఒకే ఏడాది మూడు విజ‌యాలు ఇచ్చాడు. అవి కూడా బంప‌ర్ హిట్లే. ఒక‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ కూడా. నిర్మాత‌ల‌కు.. బ‌య్య‌ర్ల‌కు లాభాల పంట పండించిన సినిమాలవి. పైగా బాగా న‌టించ‌లేదా అంటే న్యాచుర‌ల్ స్టార్ అని పేరులోనే ఉంది నానికి. అయినా కూడా ఇప్పుడు నానికి అన్యాయం జ‌రిగింది అంటున్నారు అభిమానులు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వేడుక‌ల్లో నానికి ఒక్క అవార్డ్ కూడా రాలేదు. ఆయ‌న న‌టించిన మూడు సినిమాల‌కు కూడా రాలేదు. 2017 ను పూర్తిగా ద‌త్త‌త తీసుకున్నాడు నాని. ఈయ‌న సినిమాల‌తో దాదాపు 140 కోట్ల బిజినెస్ జ‌రిగింది.

నేనులోకల్.. ఎంసిఏ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు.. అవి ప‌క్క‌న‌బెట్టినా నిన్నుకోరిలో అద్భుతంగా న‌టించాడు నాని. క‌నీసం ఈ సినిమాకైనా నాని బెస్ట్ యాక్ట‌ర్ గా క్రిటిక్స్ విభాగంలో కూడా ప‌నికిరాలేదా అంటున్నారు అభిమానులు. ఎందుకంటే మెయిన్ అవార్డ్ మ‌రో పోటీ లేకుండా అర్జున్ రెడ్డి సినిమాకు గానూ విజ‌య్ దేవ‌ర‌కొండ అందుకున్నాడు. ఇక క్రిటిక్స్ కోటాలో వెంక‌టేష్కు అవార్డు ఇచ్చారు. అది కూడా గురు సినిమాకు. అస‌లు రీమేక్ సినిమాల‌కు అవార్డులు ఇవ్వ‌కూడ‌ద‌నే రూల్ ఉంది. కానీ అవ‌న్నీ కాద‌ని ఇప్పుడు వెంక‌టేశ్ కు ఇచ్చారు. మ‌రలాంటి స‌మ‌యంలో నాని ఏం చేసాడు..? ఈ మూడు సినిమాల్లో ఒక్క సినిమాలో కూడా ఆయ‌న అవార్డ్ విన్నింగ్ యాక్టింగ్ చేయ‌లేదా..? ఏమో మ‌రి ఇది ఫిల్మ్ ఫేర్ జ్యూరికే తెలియాలి..!

User Comments