నాని.. అమీర్ ఆఫ్ టాలీవుడ్..

అవును.. నిజంగానే ఇప్పుడు అమీర్ ఖాన్ ఆఫ్ టాలీవుడ్ లా మారిపోయాడు. ఎందుకు ఇంత పెద్ద ప‌దం అంటున్నాం అనుకుంటున్నారా.. ఇప్పుడు నాని చేస్తున్న ప‌నులు చూస్తుంటే అమీర్ ఖాన్ ఆఫ్ టాలీవుడ్ అన‌డం త‌ప్పేం కాద‌నిపిస్తుంది. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ సినిమాల‌కు అన్నీ తానేయై చూసుకుంటాడు. ఆయ‌న సినిమాల‌కు ప్ర‌త్యేకంగా పిఆర్వోల‌తో కూడా ప‌నిలేదు. ప్ర‌మోష‌న్ అంతా త‌నే ద‌గ్గ‌రుండి చూసుకుంటాడు. ఇప్పుడు తెలుగులో నాని కూడా ఇదే చేస్తున్నాడు. ఈయ‌న సినిమాల‌కు ప్ర‌మోష‌న్ మొత్తం చేసుకునేది నానినే. త‌న సినిమాల‌కు ఇత‌రుల‌తో ప‌నిలేదు అస్స‌లు. అన్నీ తానే చూసుకుంటాడు.

సినిమాకు క‌మిటైన ద‌గ్గ‌ర్నుంచీ దాన్ని త‌న భుజాల‌పై వేసుకుంటాడు న్యాచుర‌ల్ స్టార్. ఈయ‌న ప్ర‌స్తుతం కృష్ణార్జున యుద్ధం సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ జ‌న‌వ‌రి 14న సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. ఒక్క‌టి కాదు.. కృష్ణార్జున అంటే ఇద్ద‌రు కాబ‌ట్టి 14న కృష్ణ‌.. 15న అర్జున్ ఫ‌స్ట్ లుక్స్ విడుద‌ల కానున్నాయి. ఇక 16న ఓ పాట‌ను విడుద‌ల చేస్తున్నారు. ఇలా సంక్రాంతి మూడు రోజులు మూడు ఫ‌స్ట్ లుక్స్ పాట‌తో పండ‌గ‌ను ప‌ర్ ఫెక్ట్ గా క్యాష్ చేసుకుని మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అనిపించుకుంటున్నాడు నాని. మేర్ల‌పాక గాంధీ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుద‌ల కానుంది. మ‌రి ఈ చిత్రంతో ట్రిపుల్ హ్యాట్రిక్ అందుకుంటాడో లేదో..?

User Comments