ప‌వ‌న్ కోసం ప్రాణం పెడుతున్న హీరో

అవును.. ఇప్పుడు నితిన్ ఇదే చేస్తున్నాడు. ఛ‌ల్ మోహ‌న్ రంగా కోసం ప‌గ‌లు రాత్రి తేడా లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నాడు ఈ కుర్ర హీరో. ఇందులో ప‌వ‌న్ కోసం ప్రాణం పెట్ట‌డం ఏముంది అనుకుంటున్నారా..? ఈ చిత్రానికి నిర్మాత ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఆయ‌న‌తో పాటు త్రివిక్ర‌మ్, సుధాక‌ర్ రెడ్డి కూడా ఉన్నారు కానీ త‌ను కాకుండా బ‌య‌టి హీరోతో ప‌వ‌న్ నిర్మిస్తున్న తొలి సినిమా ఇది. దాంతో ఛ‌ల్ మోహ‌న్ రంగాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. దాంతో త‌న దేవుడి ప‌రువు కాపాడ‌టానికి.. న‌మ్మ‌కం నిల‌బెట్ట‌డానికి తెగ క‌ష్ట‌ప‌డుతున్నాడు నితిన్. ఓ వైపు షూటింగ్ పూర్తిచేసి డ‌బ్బింగ్ చెప్తూనే.. మ‌రోవైపు ప్ర‌మోష‌న్ ను కూడా భుజాన వేసుకున్నాడు నితిన్.

ప్రస్తుతానికి ఛ‌ల్ మోహ‌న్ రంగా డ‌బ్బింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కూడా త్వ‌ర‌గా పూర్తిచేసి.. ఏప్రిల్ 5న సినిమా విడుద‌ల చేయ‌బోతున్నారు. మేఘాఆకాష్ ఈ చిత్రంలో మ‌రోసారి నితిన్ కు జోడీగా న‌టిస్తుంది. ఇద్ద‌రూ క‌లిసి లైలో న‌టించారు. అది ఫ్లాప్ అయినా కూడా మ‌రోసారి ఈ భామ‌కే ఛాన్సిచ్చాడు నితిన్. ఈ సినిమా స‌క్సెస్ నితిన్ కెరీర్ కు కీల‌కం. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు కూడా. తాను న‌ట‌న‌కు దూరం అయినా.. నిర్మాణానికి మాత్రం ద‌గ్గ‌ర‌గానే ఉంటాన‌ని.. కొత్త‌కథ‌లు వ‌స్తే నిర్మిస్తాన‌ని చెప్పాడు ప‌వ‌ర్ స్టార్. అందుకే చ‌ల్ మోహ‌న్ రంగా హిట్టైతే ఇలాంటి సినిమాలు ప‌వ‌న్ నుంచి ఊహించొచ్చు. ఇప్పుడు చెప్పండి.. ప‌వ‌న్ కోసం నితిన్ ప్రాణం పెడుతున్నాడా లేదా..?