ప్రాణాలు తీసేసిన అర్జున్ రెడ్డి పిల్ల‌

అవును.. నిజంగానే ప్రాణాలు తీసింది అర్జున్ రెడ్డి బ్యూటీ శాలిని పాండే. అంత‌గా ఏం చేసింది అనుకుంటున్నారా..? ఓ పాట పాడింది. అస‌లు ఈ భామ‌లో ఇంత‌మంచి సింగ‌ర్ ఉందా అనేలా పాట‌తో మాయ చేసింది ఈ బ్యూటీ. వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా తేజాస్ శంక‌ర్ బ్యాచ్ తో క‌లిసి నా ప్రాణ‌మే అంటూ పాడింది శాలిని. ఈ పాట విన్న త‌ర్వాత ఖచ్చింత‌గా అంద‌రూ అర్జున్ రెడ్డి పిల్ల‌తో ప్రేమ‌లో ప‌డిపోవ‌డం ఖాయం. అద్భుత‌మైన హ‌స్కీ వాయిస్ తో మ‌తులు పోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇంత త్వ‌ర‌గా తెలుగు నేర్చుకుని ఇక్క‌డ పాట పాడ‌టం అద్భుత‌మే. మ‌రోవైపు సినిమాల‌తోనూ బిజీగా ఉంది శాలిని.

త‌మిళ‌నాట 100 ప‌ర్సెంట్ ల‌వ్ సినిమా రీమేక్ లో ఈ భామే న‌టిస్తుంది. ఈ చిత్రంలో ముందు లావ‌ణ్య త్రిపాఠిని తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆమెను త‌ప్పించి షాలిని పాండేనే హీరోయిన్ గా తీసుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. 100 ప‌ర్సెంట్ ల‌వ్ రీమేక్ తో పాటు మ‌హాన‌టిలోనూ న‌టిస్తుంది షాలిని పాండే. సావిత్రి బ‌యోపిక్ గా మ‌హాన‌టి సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్నాడు. కీర్తిసురేష్ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇందులో షాలిని పోషించే పాత్రేంటి..? ఎవ‌రి క్యారెక్ట‌ర్ లో ఈమె క‌నిపించ‌బోతుంద‌నే విష‌యాలు మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. ఈ మ‌ధ్యే దుల్క‌ర్ స‌ల్మాన్ తో ఓ సినిమాలో న‌టించ‌బోతుంది షాలిని పాండే. ఏఎస్ కార్తిక్ తెర‌కెక్కించ‌బోయే ఈ చిత్రంలో దుల్క‌ర్ స‌ల్మాన్ కి జోడీగా న‌టించ‌బోతుంది ఈ బ్యూటీ. మొత్తానికి అర్జున్ రెడ్డి పాప అన్నీ టాలెంట్స్ ఒకేసారి చూపించేస్తుంది.