షాక్.. రేప్ చేస్తామని నటి కి ట్వీట్లు, ఫిర్యాదు

బాలీవుడ్ నటి, గాయని సుచిత్రా కృష్ణమూర్తి రీసెంట్ గా ‘అజాన్’ గురించి ట్వీట్ చేసి సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహానికి గురైన విషయం తెలిసే ఉంటుంది. ప్రధానంగా తెల్లవారుజామున చెవులకు ఇబ్బందిగా ‘అజాన్’ పిలుపు ఇవ్వడాన్ని సుచిత్రా కృష్ణమూర్తి తప్పుబడుతూ.. తన దేవుడిని గుర్తుచేసేందుకు ఇలా పబ్లిక్ లౌడ్ స్పీకర్లు వాడాల్సిన అవసరం లేదని, ఇది బలవంతంగా మతాన్ని ప్రజలపై రుద్దడమేనని సంచలన కామెంట్లు చేశారు. దీంతో ఆమె వ్యాఖ్యలను చాలా మంది తప్పుబడితే, కొంతమంది మాత్రం సమర్థించారు.

ఇక ఇప్పుడేమో కొంతమంది మతారాధకులు ఆమె పట్ల సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందింస్తుండటం చర్చనీయాంశం అవుతుంది. ఈ క్రమంలో కొందరు ఆమెపై లైంగికంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం.. రేప్ చేస్తామని బెదిరించడం ఇప్పుడు వివాదంగా మారుతుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వెల్లువెత్తిన లైంగిక వేధింపుల ట్వీట్లపై ఆమె తాజాగా పోలీసులను ఆశ్రయిస్తూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా అయింది. అంతేకాకుండా ఈ ఫిర్యాదు ఆధారంగా అప్పుడే నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.

ఇదిలా ఉంటే, ఇప్పటివరకు కొంతమంది నుంచి తనకు వచ్చిన లైంగిక బెదిరింపుల ట్వీట్లను కొన్నింటిని స్క్రీన్ షాట్లు తీసి, వాటిని సుచిత్రా కృష్ణమూర్తి పోస్ట్ చేస్తూ.. ఈ వికృత వ్యక్తులను అందరూ చూడాలని, నా దేశాన్ని చూస్తే జాలి వేస్తోందని, మహిళల పట్ల ఇలాంటి దృక్పథం ఉన్నప్పుడు ప్రపంచంలో మన దేశమే రేప్ రాజధానిగా ఉండటంలో ఆశ్చర్యం ఏముందని తాజాగా పేర్కొనడం జరిగింది. దీంతో ఇప్పుడు ఈ టాపిక్ పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే, ఆ మధ్య టాప్ సింగర్ సోనూ నిగమ్ కూడా ఇలానే మతం నేపథ్యంలో ఓ ట్వీట్ చేసి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురై, నెమ్మదిగా బయటపడ్డ విషయం తెలిసే ఉంటుంది.

Follow US