ర‌వితేజ సినిమాలో త‌రుణ్ విల‌న్

అదేంటి.. అప్పుడే త‌రుణ్ విల‌న్ అయిపోతున్నాడా..? ఒక‌ప్పుడు హీరోగా వెలిగిన త‌ర్వాత ఇప్పుడు అవ‌కాశాల్లేక విల‌న్ అవుతున్నాడా ఏంటి అనుకుంటున్నారా..? ఆ అనుమానాలేవీ అక్క‌ర్లేదు. కావాలంటే ఖాళీగా ఉంటాను కానీ విల‌న్ గా మాత్రం మార‌న‌ని ఇదివ‌ర‌కే క్లారిటీ ఇచ్చాడు త‌రుణ్. ర‌వితేజ సినిమాలో న‌టించ‌బోయే త‌రుణ్ మ‌రొక‌రు. ఖైదీ నెం.150 సినిమా గుర్తుంది క‌దా.. అందులో విల‌న్ గా న‌టించిన త‌రుణ్ అరోరానే ఇప్పుడు ర‌వితేజ సినిమా కోసం తీసుకుంటున్నారు. శీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న ఓ సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ నుంచి షూటింగ్ మొద‌లు కానుంది. అమెరికా నేప‌థ్యంలో ఈ క‌థ సాగ‌నుంది. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ టైటిల్.. కానీ ఇందులో ఒక్క ర‌వితేజ‌నే ఉంటాడంటున్నాడు శీనువైట్ల‌. మ‌రి టైటిల్ ఎందుకు అలా పెట్టాం అనేది మాత్రం సినిమా చూసిన త‌ర్వాతే అర్థం అవుతుందంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అను ఎమ్మాన్యువ‌ల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టించ‌నుంది. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు. ఈ సినిమాలో సునీల్ క‌మెడియ‌న్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. మొత్తానికి చిరంజీవి విల‌న్ తోనే ర‌వితేజ కూడా ఇప్పుడు త‌ల‌ప‌డ‌బోతున్నాడు.