అమీ జాక్సన్ బికినీలు అమ్ముకోనుందా..?

Actress Amy Jackson launch beachwear line

బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్ బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా చేస్తోన్న హాట్ హాట్ రచ్చ ఏ రేంజ్ లో ఉందో ఈ మధ్య చూస్తున్నాం. ఇదే సమయంలో తెరకు మించిన అందాల ప్రదర్శనతో సోషల్ మీడియా వేదికగా అమీ జాక్సన్ బికినీలతో దిగుతున్న ఫోటోలు.. అసలు బట్టలు వేసుకుందా లేదా అన్నట్లుగా ప్రదర్శనకు పెట్టేస్తోన్న ఒంపుసొంపులను చాలామంది కళ్ళార్పకుండానే చూసేస్తున్నారు. అందుకేనేమో ఇప్పుడు ఈ అందాల ప్రదర్శన నుంచి పుట్టుకొచ్చిన ఐడియాతో ఓ కొత్త వ్యాపారానికి అమీ జాక్సన్ శ్రీకారం చుడుతోంది. ఆ బిజినెస్ కూడా తనకు ఎంతగానో పేరు తెచ్చిపెడుతున్న బికినీ లతోనే కావడం ఇక్కడ అసలైన విశేషం.
ఆ స్టోరీలోకి వెళితే, టూర్లు తిరగడం అంటే తెగ ఇష్టపడే అమీ జాక్సన్.. తనకు అన్నిచోట్లా కంఫర్ట్ గా ఉండే స్విమ్ వేర్, బికినీ లు అందుబాటులో లేకపోవడంతో తనకు తగినట్లుగా తనే డిజైన్ చేసుకోవడం స్టార్ట్ చేసిందట. దీంతో ఇప్పుడు దానినే బ్రాండ్ గా మార్చాలని ఆలోచన తట్టడంతో.. అమల్లో పెడుతున్నట్లు ప్రకటించేసింది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రధానంగా స్విమ్ వేర్ మీదే అమీ జాక్సన్ దృష్టి పెడుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా వీటిలో కవర్-అప్స్, బికినీలు, సింగిల్ పీస్ కాస్ట్యూమ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇక వీటిని అమీ జాక్సన్ చవక ధరల్లోనే విక్రయిస్తానని చెబుతుండటం విశేషం.
ఈ సందర్బంగా అమీ జాక్సన్ కూడా ఈ బికినీ డ్రెస్సుల బిజినెస్ పై స్పందిస్తూ.. తనకు ఏ డ్రెస్ తగినదనే విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రతీ మహిళకు ఉందని, ఒకవేళ నగ్నంగా తిరగాలని కోరుకున్నా అది వారి వ్యక్తిగత ఇష్టమేనని, ఎవరూ ప్రశ్నించడానికి జడ్జ్ చేయడానికి అవకాశం లేదని చెప్పుకొచ్చింది. అలాగే బట్టలు ఒకరి కోసం వేసుకునేవి కాదని, వారి కంఫర్ట్ కోసం వేసుకుంటారని, మొత్తంగా వ్యక్తిగత ఇష్టమే ఎలాంటి దుస్తులు వేసుకోవాలనే అంశాన్ని నిర్ణయించాలని అమీ జాక్సన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఏదిఏమైనా, మామూలుగానే బికినీ ఫోజులు, పీళికల్లాంటి హాట్ హాట్ డ్రెస్సులతో ఎక్స్ పోజింగ్ చేసే అమీ జాక్సన్ ఇప్పుడు బికినీ ల బిజినెస్ కు రెడీ అవడం నిజంగా విశేషమే మరి.