తమిళ హీరోకి తెలుగమ్మాయి షాక్ ఇచ్చిందా..?

రాజోలు బ్యూటీగా, తెలుగమ్మాయిగా బాగానే పేరు తెచ్చుకున్న నటి అంజలి టాలీవుడ్ కంటే కోలీవుడ్ లోనే ఎక్కువగా హీరోయిన్ గా రాణించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో పెద్ద హీరోల సరసన నటించినా రాని స్టార్ డమ్ ను.. అక్కడ కుర్ర హీరోలతో జత కడుతూ అంజలి సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే కోలీవుడ్ యంగ్ హీరో జై తో అంజలి ప్రేమలో పడిందని.. త్వరలోనే ఈ స్టార్స్ ఇద్దరూ ఒక్కటి కాబోతున్నారని వార్తలు వచ్చాయి. అందులోనూ జై – అంజలి ఇద్దరూ కూడా తాము ప్రేమలో ఉన్నట్లే మీడియా ముందు బిహేవ్ చేయడంతో.. ఈ ప్రేమ వ్యవహారం నిజమేనని అందరూ నమ్ముతూ వచ్చారు. కానీ, తాజాగా అంజలి ఇచ్చిన షాక్ తింటే, వీళ్ళ లవ్ స్టోరీ తెలిసినవాళ్ళు ఎవరైనా పడిపోవాల్సిందే.

ఈ మేరకు తాజాగా ఓ భేటీలో మాట్లాడిన అంజలి తన సినీ పయనం హ్యాపీగా సాగుతోందని పేర్కొంటూ.. ప్రస్తుతం ప్రేమ, పెళ్లి వంటి అంశాల గురించి ఆలోచించే తీరిక తనకు లేదని, అయినా తన మనస్సుకు నచ్చినోడు ఇంకా తారసపడలేదని పేర్కొనడం కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అంతేకాకుండా తనను పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నట్లు హీరో జై అన్నట్లు తనకు తెలియదని, ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుందని వేదాంతాన్ని వల్లించడం గమనార్హం.

దీంతో హీరో జై కి గాని అంజలి షాక్ ఇచ్చిందా అంటూ మీడియా సర్కిల్ లో చర్చలు జరుగుతున్నాయి. అలాగే జై కి అంజలి కి మధ్య మనస్పర్థలు ఏమైనా వచ్చాయా? అందుకే తనకు నచ్చినోడు ఇంకా తారసపడలేదని అంజలి చెప్పిందా? అంటూ తెగ చర్చించేసుకుంటున్నారు. మరి దీనికి జై గాని క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. ఇకపోతే, అంజలి – జై కలిసి నటించిన రీసెంట్ మూవీ బెలూన్ ఇప్పుడు రిలీజ్ కు రెడీ కావడం విశేషం.