డ్ర‌గ్స్ కేసులో హాటీ అరెస్ట్

Last Updated on by

మాద‌క‌ద్ర‌వ్యాలు క్ర‌య‌విక్ర‌యాల్లో మ‌ల‌యాళ టీవీ సినీ ఆర్టిస్ట్ దొరికిపోవ‌డం లేటెస్టుగా సంచ‌ల‌న‌మైంది. న‌టి అశ్వ‌తి బాబును తిర‌క‌క్క‌ర పోలీసులు ఈ ఆదివారం నాడు వ‌ల‌ప‌న్ని అరెస్టు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అశ్వ‌తి త‌న కార్ డ్రైవ‌ర్‌తో క‌లిసి ఎండిఎంఏ అనే మాద‌క ద్ర‌వ్యాన్ని క‌స్ట‌మ‌ర్‌కి చేర‌వేస్తూ పోలీసుల‌కు చిక్క‌డంతో మ‌ల్లూవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది.

ఈ డ్ర‌గ్ దందాలో ఇంకా ఎవ‌రెవ‌రు ఉన్నారు? అన్న‌దానిపైనా పోలీసులు విచారిస్తున్నార‌ట‌. న‌టి అశ్వ‌తి తిరువ‌నంత పురం వాసి. చాలాకాలంగా అక్క‌డ టీవీ, సినీ ఇండ‌స్ట్రీలో స్థిర‌ప‌డ్డారు. మాద‌క ద్ర‌వ్యాల విక్ర‌యం అన‌గానే అది కేవ‌లం ఏ ఒక్క ప‌రిశ్ర‌మ‌కో సంబంధించిన గొడ‌వ కాదు. అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఈ స‌మ‌స్య ఉంది. ఇదివ‌ర‌కూ టాలీవుడ్‌లోనూ సిట్ ద‌ర్యాప్తులో ప‌లువురు స్టార్ల పేర్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. తాజాగా బ‌య‌ట‌ప‌డిన తార‌తో ఇంకా ఎవ‌రెవ‌రి లింకులు బ‌య‌ట‌ప‌డ‌తాయోన‌న్న ఆందోళ‌న ప్ర‌స్తుతం వ్య‌క్త‌మవుతోంది. ముంబై ప‌రిశ్ర‌మ నుంచి టాలీవుడ్, మాలీవుడ్, శాండ‌ల్వుడ్, కోలీవుడ్ అన్నిచోట్లా ఈ డ్ర‌గ్స్ దందా సాగుతోంద‌న్న ప్ర‌చారం ఎప్ప‌టిక‌ప్పుడు తెర‌పైకొస్తోంది. ఇదే నేప‌థ్యంలో సినీప‌రిశ్ర‌మ‌కు బ్యాడ్ నేమ్ తెచ్చే ఇలాంటి దందాల్ని అరిక‌ట్టేందుకు సినీపెద్దలు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

User Comments