హైదరాబాద్ ఇల్లు.. ఇప్పుడు క్యాథరిన్ వంతు

టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తోన్న పక్క రాష్ట్రాల హాట్ బ్యూటీస్ ఇక్కడే ఓ ఇల్లు కొనుక్కుని సెటిల్ అయిపోవడం అనేది ఈమధ్య ఎక్కువగా కనిపిస్తోన్న విషయం తెలిసిందే. మొదట్లో భాగ్యనగరి నచ్చినా కూడా పెద్దగా ఆసక్తి చూపించని పరిస్థితులు ఉంటే.. ఈ జనరేషన్ బ్యూటీస్ మాత్రం తెలివిగా హైదరాబాద్ లో తమకంటూ ఓ అడ్రెస్ ఉంచుకోవడానికి రెడీ అవుతుండటం నిజంగా విశేషమనే చెప్పాలి. ఈ క్రమంలో మొదట తెలుగింటి కోడలు కాబోతున్న సమంత హైదరాబాద్ లో ఓ ఫ్లాట్ కొనుకున్న విషయం అందరికీ తెలుసు.

తర్వాత టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ మన భాగ్యనగరిలో ఓ డ్యూప్లెక్స్ హౌస్ కొనుక్కోవడమే కాకుండా ఇక్కడే జిమ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసిందంటే ప్లానింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమైపోతుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి మరో యంగ్ టాలెంటెడ్ హాట్ బ్యూటీ కూడా చేరడం ఇంట్రెస్టింగ్ మేటర్ అనే చెప్పుకోవాలి. ఇకపోతే, ఆ యంగ్ బ్యూటీ మరెవరో కాదు, ఇప్పటికే ఇద్దరమ్మాయిలతో, సరైనోడు లాంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించి, ఇప్పుడు గౌతమ్ నంద, నేనే రాజు నేనే మంత్రి లాంటి బడా సినిమాలతో వస్తోన్న క్యాథరిన్ థ్రెసా.

మామూలుగానే బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ సాలిడ్ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు చేస్తుండటంతో.. రీసెంట్ గా మన ఇండస్ట్రీకి దగ్గరగా ఉండే పోష్ ఏరియాలో ఓ అదిరిపోయే ఫ్లాట్ కొనుక్కుందట. అంతేకాదండోయ్, హైదరాబాద్ తనకు ఎంతో నచ్చేసిందని చెబుతున్న క్యాథరిన్.. ఇప్పుడు హౌస్ తో పాటు తెలుగు భాషపై పట్టు సాధించేందుకు ఓ ట్యూటర్ ను కూడా ఏర్పాటు చేసుకున్నానని చెబుతుండటం గమనార్హం. మొత్తంగా ఇప్పుడు హైదరాబాద్ పై ఈ బ్యూటీ బాగానే కన్నేసిందని అర్థమైపోతుంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ హైదరాబాద్ హౌస్ లిస్టులోకి రాశిఖన్నా, లావణ్య త్రిపాఠి లాంటి రైజింగ్ యంగ్ బ్యూటీస్ కూడా ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వినిపిస్తుండటం గమనార్హం.

Follow US