హాట్ టాపిక్.. పూరీ స్టోరీతో ఛార్మి డైరెక్షన్..!

ఛార్మింగ్ గర్ల్ ఛార్మి సెట్స్ లో ఎంత చలాకీగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర లేదు. ఛార్మి చలాకీగా ఉంటుంది కాబట్టే ఇండస్ట్రీ లో నెట్టుకురాగలుగుతుంది.  మంచి సినిమాలు లేకపోతే ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ ఫేడ్ అవుట్ కావాల్సిందే. ఇది ఇండస్ట్రీ ఎరిగిన సత్యం. అయితే, ఛార్మి మాత్రం అందుకు విరుద్ధం అని చెప్పొచ్చు. ఛార్మి హీరోయిన్ గా చేసిన చిత్రాలు కొన్ని మాత్రమే. మరి కొన్నింటిలో సపోర్టింగ్ రోల్ చేసుకుంటూ వచ్చింది. చాలా సినిమా ఫ్లాప్ అయ్యాయి.  హిట్ శాతం తక్కువ.  కానీ, నిన్న మొన్నటి వరకు చార్మీకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి.  చార్మీకి అవకాశాలు రావడం వెనుక పూరి ఉన్నాడనే వార్తలు వచ్చాయి. ఇది ఎంత వరకు నిజం అనే విషయం తెలియదు.  ఇది నిజం కాదు అని కూడా చెప్పలేము.
ఇక ఇదిలా ఉంటే, ఛార్మి ఇటీవలే ప్రొడ్యూసర్ గా మారి జ్యోతిలక్ష్మి అనే సినిమా చేసింది. ఈ సినిమా హిట్ కాకపోయినా.. ప్రొడ్యూసర్ గా ఛార్మికి డబ్బులు మిగిలాయని చెప్పొచ్చు. ఈ విషయాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఛార్మి గురించిన మరో వార్త నెట్ లో హల్చల్ చేస్తోంది.ఛార్మి త్వరలోనే మెగాఫోన్ పట్టుకోబోతున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఛార్మి బాలకృష్ణ నటిస్తున్న 101 చిత్రం పైసా వసూల్ కు కో డైరక్టర్ గా చేస్తున్నది. పూరి దగ్గరుండి దర్శకత్వంలో మెళుకువలు నేర్పుతున్నాడట. ఈ సినిమా తరువాత ఛార్మి దర్శకురాలిగా మారుతుందని వార్తలు వస్తున్నాయి.  ఛార్మి దర్శకత్వం వహించే సినిమాకు పూరి జగన్నాథ్ కథను అందిస్తారట. మరి పూరి నిర్మాతగా వ్యవహరిస్తారో లేదా ఎవరైనా బయట వ్యక్తులు నిర్మాతగా వ్యవహరిస్తారో చూడాలి.