షాక్.. ప్రమోషన్ కోసం కాజల్ కు రూ.30 లక్షలు..?

 

టాలీవుడ్ భల్లాలదేవుడు రానా దగ్గుబాటి లేటెస్ట్ మూవీ ‘నేనే రాజు నేనే మంత్రి’ తాజాగా రిలీజై మంచి టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రానాకు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించి మెప్పించిందని అంటున్నారు. అయితే, ఆ విషయం ఎలాగున్నా బయట సినిమా ప్రమోషన్ పేరు చెప్పి కాజల్ ఏకంగా 30 లక్షల రూపాయలు తీసుకుందని తెలియడం మాత్రం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది. అసలు విషయంలోకి వెళితే, కాజల్ ఇప్పటివరకు తాను చేసిన కొన్ని పెద్ద సినిమాలకు కూడా ప్రమోషన్ అంటే ఏదో రావాలి కదా అన్నట్లు వ్యవహరించిన విషయం తెలిసే ఉంటుంది. కానీ, నిన్నటివరకు నేనే రాజు నేనే మంత్రి సినిమా కోసం అయితే కాజల్ టీవీ స్టూడియోల చుట్టూ తిరుగుతూ బ్రేక్ లేకుండా ఇంటర్వ్యూలు ఇచ్చిందని అంటున్నారు.
అంతేకాకుండా కొన్ని కాలేజీ ఈవెంట్లకు కూడా వెళ్తూ సినిమా ప్రమోషన్స్ ను తన భుజాలపై బాగానే మోసిందని చెబుతున్నారు. దీంతో అసలు కాజల్ ఈ సినిమా ప్రమోషన్ అనేసరికి అంతగా ఎందుకు కష్టపడిపోతుందో అంటూ కొంతమంది ఆరా తీశారట. ఈ నేపథ్యంలో చివరకు నిర్మాత సురేష్ బాబు ఈ సినిమా ప్రమోషన్ కోసం కాజల్ కు ఏకంగా 30 లక్షల రూపాయలు ఇచ్చారని తెలియడం హాట్ టాపిక్ గా మారింది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని, ఇలా సినిమా ప్రమోషన్ కోసం తెలివిగా డీల్ సెట్ చేసుకోవడంలో సురేష్ బాబుకు మంచి అనుభవం ఉందని అంటున్నారు. అయితే, ఆ డీల్ కాజల్ దగ్గరకు రావడమే ఆశ్చర్యం కలిగిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు లేని కాజల్ కు నిజంగా 30 లక్షలు ఇలా ప్రమోషన్ కోసం ఇచ్చారంటే.. అది మంచి ఆఫర్ అనే అనాలి. మరి ఇదే నిజమైతే.. అందుకే కాజల్ అంతలా నేనే రాజు నేనే మంత్రి ని ప్రమోట్ చేసిందేమో.