ఎన్టీఆర్ సినిమాలో విజయవాడ హీరోయిన్

Last Updated on by

ల‌య‌.. స‌రిగ్గా 20 ఏళ్ల కింద తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చి.. తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా ప‌నికిరారు అనుకున్న వాళ్ల‌కు త‌న న‌ట‌న‌తోనే మంచి ఆన్స‌ర్ ఇచ్చిన అచ్చ తెలుగు అమ్మాయి. విజ‌య‌వాడ నుంచి వ‌చ్చిన ఈ ముద్దుగుమ్మ వేణు స్వ‌యంవ‌రంతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది. తొలి సినిమాతోనే అంద‌రి మెప్పు అందుకున్న ల‌య‌.. చాలా త‌క్కువ టైమ్ లోనే 50 సినిమాల్లో న‌టించింది. చివ‌ర‌గా ఈమె 2010లో బ్రహ్మలోకం టూ యమలోకం అనే సినిమాలో పరాశక్తి పాత్రలో కనిపించింది. ఆ త‌ర్వాత‌ లయ పూర్తిగా సినిమాల‌కు దూర‌మైంది. అసలు ఈమె ఇప్పుడెక్కడుంది.. ఏం చేస్తుంద‌నే విష‌యంపై కూడా చాలా మందికి క్లారిటీ లేదు. సినిమాల‌కు దూర‌మైన త‌ర్వాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడింది ల‌య‌. అక్క‌డే కొన్ని సంవత్సరాలుగా భ‌ర్త‌తో క‌లిసి ఉంటుంది ల‌య‌.

తెలుగ‌మ్మాయే అయినా.. లాస్ ఎంజిల్స్ తో ల‌య‌కు చెప్ప‌లేని అనుబంధం ఏర్ప‌డింది. పైగా స్వతహాగా కూచిపూడి డ్యాన్సర్ అయిన లయ అమెరికాలోనే ఉంటూ ఆ క‌ళ‌ను ప్రోత్స‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె అక్క‌డ ఓ డ్యాన్స్ స్కూల్‌ నిర్వహిస్తున్నారు. అందులోనే ఆమె కూతురికి కూడా డ్యాన్స్ నేర్పిస్తున్నారు. ఇక సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ ఇప్ప‌టికీ త‌న‌కు నటించాలని ఉందని.. అయితే అమెరికాలో ఉండ‌టంతో అది సాధ్య‌ప‌డ‌ట్లేద‌ని చెబుతుంది ల‌య‌. ఇన్నాళ్ల‌కు ల‌య కోరిక‌ను త్రివిక్ర‌మ్ మ‌న్నిస్తున్నాడు. ఈయ‌న ఎన్టీఆర్ తో తెర‌కెక్కించ‌బోయే సినిమాలో ల‌య కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌బోతుంద‌ని తెలుస్తుంది. త‌న ప్ర‌తీ సినిమాలోనూ హీరోతో స‌మానంగా ఓ లేడీ పాత్ర‌ను సృష్టించ‌డం త్రివిక్ర‌మ్ అల‌వాటు. అ..ఆ, అత్తారింటికి దారేదిలో న‌దియా.. అజ్ఞాత‌వాసిలో ఖుష్బూ.. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో స్నేహ‌.. ఇప్పుడు ల‌య‌ను తీసుకొస్తున్నాడు మాట‌ల మాంత్రి కుడు. మొత్తానికి ఇన్నేళ్ళ త‌ర్వాత ల‌య తెలుగు ఇండ‌స్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తుంద‌న్న‌మాట‌.

User Comments