రిజిస్టర్ ఆఫీస్ లో ప్రియమణి పెళ్లి.. నిజమే  

Actress Priyamani marriage registrar office

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ టైమ్ లో బాగానే రాణించిన ప్రియమణి సౌత్ లో మిగిలిన భాషల్లో కూడా మంచి గుర్తింపే తెచ్చుకున్న విషయం అందరికీ తెలుసు. ప్రస్తుతమైతే కొన్ని కన్నడ సినిమాలతో పాటు అక్కడ బుల్లితెరపై కూడా కొన్ని షో లలో సందడి చేస్తూ ప్రియమణి బాగానే ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో తెలుగు బుల్లితెరపై కూడా ఓ డ్యాన్స్ షో కి జడ్జ్ గా ఎంట్రీ ఇచ్చి జనాల చూపులను తనవైపు తిప్పుకుంటున్న ప్రియమణి.. ఇప్పుడు పర్సనల్ లైఫ్ తో అయితే ఏకంగా స్వీట్ షాకే ఇస్తోంది. ఇంతకుముందే తన చిరకాల బాయ్ ఫ్రెండ్ ముస్తఫా రాజ్ తో నిశ్చితార్థం చేసుకున్న ప్రియమణి ఇప్పుడు పెళ్లి డేట్ ను ఫిక్స్ చేసుకోవడమే కాకుండా పెళ్లి జరిగే ప్లేస్ ను కూడా సెట్ చేసుకుని ఆశ్చర్యపరిచింది.
ఇక ఇక్కడ అంతగా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆగష్టు 23 నే పెళ్ళికి రెడీ అయిన ప్రియమణి రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పకనే చెప్పి స్వీట్ షాక్ ఇచ్చింది. ఓవైపు సెలబ్రిటీలు అందరూ అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేసుకుంటుంటే.. ప్రియమణి మాత్రం ఇలా ఆడంబరాలు ఏమీ లేకుండా సింపుల్ గా రిజిస్టర్ పెళ్లి చేసేసుకోవాలని నిర్ణయించుకుందట. అనంతరం 24వ తేదీన బెంగళూరులో ఇండస్ట్రీ పెద్దలను, తన తోటి నటీనటులను, ప్రముఖులను పిలిచి విందు ఇవ్వాలని ప్లాన్ చేసుకుందట. దీంతో ప్రియమణి ఫ్యాన్స్ కొంత ఫీలవుతున్నట్లు కనిపిస్తోంది. మరి హంగు హార్భాటాలకు నిజంగానే దూరంగానే ప్రియమణి ఏ హడావుడి లేకుండా పెళ్లి చేసేసుకుంటే, మీడియా జనాలు కూడా బాధపడతారేమో అనిపిస్తోంది. ఏదిఏమైనా, ప్రియమణి లాంటి హీరోయిన్ లవ్ మ్యారేజ్ కాస్తా ఇలా రిజిస్టర్ ఆఫీస్ కే పరిమితం అయిపోవడం అంటే, అది నిజంగా కొంతమందికి బాధ కలిగించే విషయమే.