ప్రియ‌మ‌ణి ఫ్రెగ్నెన్సీ లీక్స్‌

Last Updated on by

ర‌బ్బ‌రు గాజులు.. ర‌బ్బ‌రు గాజులు.. ర‌బ్బ‌రు గాజులు తెచ్చానే..
రిబ్బ‌ను పువ్వులు రిబ్బ‌ను పువ్వులు రిబ్బ‌ను పువ్వులు తెచ్చానే..
నువ్వంటే ప‌డి ప‌డి.. నువ్వంటే ప‌డి ప‌డి .. చ‌చ్చానే.. !!

… అంటూ తార‌క్ అంత‌టోడే ప్రియ‌మ‌ణి కోసం తెగ ఇద‌య్యాడు. `య‌మ దొంగ` సినిమాతో ఈ మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లోకి ఓ రేంజులో ఎంట్రీ ఇచ్చింది. అప్ప‌టికే ఉత్త‌మ‌న‌టిగా ఓ త‌మిళ సినిమాతో జాతీయ అవార్డును అందుకుంది. వ‌స్తూనే బ్లాక్‌బ‌స్ట‌ర్ ఎంట్రీ. అటుపై తెలుగులో ద‌శాబ్ధం పాటు ప్రియ‌మ‌ణి ఆడిన ఆట గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఇక‌పోతే ప్రియ‌మ‌ణి ప్ర‌స్తుతం త‌న కొలీగ్ ముస్త‌ఫా రాజ్‌ని పెళ్లాడి లైఫ్‌లో సెటిలైంది. పెళ్లి త‌ర్వాత బుల్లితెర రియాలిటీ షోల‌కు జ‌డ్జిగానూ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ జంట 23 ఆగ‌స్టు 2017లో ఒక‌ట‌య్యారు. తాజాగా ప్రియా ఓ తీపి వార్త‌ను ఫ్యాన్స్‌కి ప‌రోక్షంగా అందించింది. తొంద‌ర్లోనే లైఫ్‌లోకి ఫ‌న్ క‌మింగ్‌.. సంథింగ్ ఇంట్రెస్టింగ్ అంటూ ట్వీట్ చేసింది. దీన‌ర్థం ప్రియ‌మ‌ణి గ‌ర్భ‌వ‌తి కాబోతోంద‌నే క‌దా?

User Comments