మంచి నటిగా గుర్తింపు పొందాలి – ప్రమోదిని

Last Updated on by

నటి ప్రమోదిని, బెంగుళూరు లో పుట్టి పెరిగి బాల నటిగా చిత్రసీమ లో అడుగు పెట్టి 40 చిత్రాలకు పైగా నటించి ఎన్నో అవార్డులు పొంది, కన్నడీయుల హృదయాలలో తనకంటూ ఒక్క స్థానం సంపాదించుకున్న నటి ప్రమోదిని ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. హీరో నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రం తో తెలుగు వెండి తెరకు పరిచయం అయిన ప్రమోదిని, వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఆక్సిజన్, నిర్మల కాన్వెంట్, ధ్రువ, రెండు రెండు ఆరు, అందగాడు, లై, కిరాక్ పార్టీ, నా పేరు సూర్య లాంటి విజయవంతమైన చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇటీవలే విడుదలైన ‘మెహబూబా చిత్రం లో హీరో పూరి ఆకాష్ కి తల్లి పాత్ర లో నటించి మేపించారు. తనకు ఇంత మంచి పాత్ర ఇచ్చిన పూరి జగన్నాధ్ గారికి తన కృతఙ్ఞతలు తెలియజేసారు.

మరి ఇన్ని మంచి చిత్రాలలో నటించి మెపించిన ప్రమోదిని మాట్లాడుతూ…

నేను కన్నడ నటిని, బాల నటిగా 40 కి పైగా చిత్రాలు చేశాను. క్లాసికల్ భరతనాట్యం డాన్సర్ ని. మా అమ్మ గారి ప్రోత్సాహంతో బాలనటిగా కన్నడ లో ‘తవ్వారు మని’ అనే చిత్రం తో నా కెరీర్ స్టార్ట్ చేసి ఎన్నో చిత్రాలు చేశాను, మంచి గుర్తింపు తెచ్చుకున్నాను, బాలనటి గా ఎన్నో అవార్డులు అందుకున్నాను. మణియే మంత్రాలయ, హుళి హెబులి లాంటి ఎన్నో సూపర్ హిట్ కన్నడ చిత్రాల్లో నటించాను. తర్వాత పెద్దయ్యాక చదువు పూర్తిచేసుకుని ఉదయ టీవీ లో యాంకర్ గా పని చేశాను అలాగే కన్నడ సీరియల్ లో కూడా నటి గా పనిచేసాను. ఒక్క సీరియల్ లో నా నటన చూసి దర్శకేంద్రులు కె రాఘవేంద్ర గారు తెలుగు సీరియల్ మనో యజ్ఞం లో ఆఫర్ ఇచ్చారు. ఆలా తెలుగు లో నా ప్రస్థానం ప్రారంభం అయింది. తర్వాత పెళ్లి చేసుకుని నా భర్త తో అమెరికా లో సెటిల్ అయిపోయాను. 5 ఏళ్ళు హౌస్ వైఫ్ ఉన్నాను కానీ నటించాలి అనే కోరిక నన్ను తిరిగి హైదరాబాద్ కు రాపించింది. ఎలాగైనా సినిమాలో నటించాలి అని సినిమా ఆఫీసులు చుట్టు తిరిగాను. చివరికి డైరెక్టర్ హను రాఘవపూడి గారు ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. 14 రీల్స్ బ్యానర్ వాళ్ళకి మరియు డైరెక్టర్ హను రాఘవపూడి గారికి ధన్యవాదాలు. తర్వాత ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అందగాడు, లై సినిమాలు చేసాను. తర్వాత డైరెక్టర్ సురేంద్ర రెడ్డి గారు నాకు రామ్ చరణ్ గారి సినిమా ధ్రువ లో మంచి క్యారెక్టర్ చేశాను, అంత గొప్ప సినిమా లో నాకు మంచి అవకాశం ఇచ్చిన సురేంద్ర రెడ్డి గారికి నా కృతఙ్ఞతలు. ఇలా వరుసగా మంచి మంచి సినిమాలు చేశాను.

ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయినా మెహబూబా సినిమా నాకు చాలా మంచి పేరు తెచ్చిపెటింది . పూరి గారు నాకు మంచి బ్రేక్ ఇచ్చారు. పూరి గారిని నా గురు గా భావిస్తున్నాను. ఇంత మంచి సినిమా ఇచ్చిన పూరి గారికి నేను ఎప్పటికి రుణపడి ఉంటాను. ఈ సినిమా చుసిన ప్రతి ఒక్కరు నన్ను ఒక్క యంగ్ మదర్ గా పొగుడుతుంటే నాకు చాలా సంతోషం వేసింది.

ఇప్పుడు రాజ్ తరుణ్ గారు నటించిన రాజు గాడు చిత్రం లో హీరోయిన్ మదర్ రోల్ చేస్తున్నాను. చాలా మంచి పాత్ర. తర్వాత, రాహుల్ రవీంద్రన్ హీరో గా నటిస్తున్న ద్రుష్టి సినిమా లో నటనకి మంచి స్కోప్ ఉన్న పాత్ర చేస్తున్నాను. తర్వాత రధం, హుషారు సినిమాలు చేస్తున్నాను.

నాకు అందరు దర్శకులతో పని చేయాలనీ ఉంది. మంచి క్యారెక్టర్ లు చేయాలనీ మంచి పేరు తెచ్చుకోవాలని నా కోరిక.

User Comments