రకుల్ రిక్షా తొక్కితే ఎలా ఉంటుందో తెలుసా..?

Actress Rakul Preet Singh rides cycle rickshaw

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్ లలో కూడా సత్తా చాటే ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు పోటీగా ఉన్న హీరోయిన్స్ అందరూ సినిమాల కోసం కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీలు లాంటివి నేర్చుకుంటుంటే.. రకుల్ మాత్రం రిక్షా ఎలా తొక్కాలో నేర్చుకోవడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది. ఆ స్టోరీలోకి వెళితే, ప్రస్తుతం రకుల్ కోలీవుడ్ లో కార్తీ హీరోగా తెరకెక్కుతోన్న ‘తీరాన్ అధిగారం ఓండ్రు’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసే ఉంటుంది.
ఈ సినిమా కోసమే తాజాగా రకుల్ సైకిల్ రిక్షా తొక్కడం నేర్చుకుందట. అయితే, నేర్చుకుంది అనేకంటే జస్ట్ అలా సింపుల్ గా తొక్కేసింది అంటే బాగుంటుందేమో. ఎందుకంటే, ఒక పాట కోసం మొదలెట్టిన ఈ రిక్షా తొక్కే కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక డ్యాన్స్ అసిస్టెంట్ రిక్షా తొక్కి చూసి చాలా కష్టంగా ఉందనిపించి మధ్యలోనే ఆపేశాడట. అంతేకాకుండా నాకే కుదర్లేదు ఇంక హీరోయిన్ ఏం చేస్తుందిలే అని.. ముందు జాగ్రత్తగా రకుల్ ను హెచ్చరించాడట. కానీ, ఏమాత్రం ఆలోచించకుండా రిస్క్ తీసుకోవడానికే రెడీ అయిన రకుల్ ఎంచక్కా రిక్షా ఎక్కేసి తొక్కేసిందట.
అది కూడా హీరో కార్తీని, రిక్షా డ్రైవర్ ను వెనకాల కూర్చోబెట్టుకుని మరీ కావడం విశేషం. దీని గురించే తాజాగా రకుల్ కూడా మాట్లాడుతూ.. రిక్షా తొక్కడానికి నేను భయపడలేదు గాని, దానిని ఎక్కడ పాడు చేస్తానో అని రిక్షా ఆయన మాత్రం చాలా భయపడ్డాడని పేర్కొంది. అలాగే రిక్షా ఆయన బ్రేక్ ఎక్కడ ఉంటుంది ఎలా వేయాలి అనే విషయాలను నాకు చాలా విపులంగా చెప్పాడని తెలిపింది. చివరగా హీరో కార్తీని, రిక్షా డ్రైవర్ ను వెనకాల కూర్చోబెట్టుకుని రిక్షా నడుపుతుంటే మంచి కిక్ ఇచ్చిందని, భలే ఉంది లెండి అంటూ రకుల్ తన అనుభవాన్ని చెప్పడం గమనార్హం. ఏమైనా, రకుల్ ది జిమ్ బాడీ కదా, అందుకేనేమో అలా తొక్కి పడేసింది. ఇక ఇప్పుడు రకుల్ రిక్షా తొక్కిన ఫోటోలు అయితే, సోషల్ మీడియాలో తెగ వైరల్ గా చక్కర్లు కొట్టేస్తున్నాయి.