ఆ డైరెక్టర్ కు సమంత పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా?

Actress Samantha applying Conditions
టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న చెన్నై చిన్నది సమంత త్వరలోనే అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో సమంత బిజీగా ఉందని ఈ మధ్య వార్తలు తెగ హల్ చల్ చేసేస్తున్నాయి. అందులో భాగంగానే తెలుగులో చెర్రీ – సుకుమార్ ల ‘రంగస్థలం 1985’ చేస్తోన్న సమంత.. తమిళంలో విజయ్ తో మెర్సల్, శివకార్తికేయన్ తో ఓ సినిమా చేస్తోంది. అయితే, ఇప్పుడు ఉన్నట్టుండి శివకార్తికేయన్ తో చేస్తోన్న మూవీ యూనిట్ కు సమంత ఓ కండిషన్ పెట్టినట్లు న్యూస్ బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటివరకు తన సింప్లిసిటీ, ముక్కుసూటితనంతో ఇలాంటి వార్తల్లో ఎప్పుడూ నిలవని సమంత.. ఇప్పుడు సడెన్ గా కండిషన్ పెట్టేవరకు వచ్చిందేంటని షాక్ అవుతున్నారా?.. అంతగా షాక్ అవ్వాల్సిన పనిలేదని టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే, సమంత కేవలం తన హెల్త్ ప్రాబ్లెమ్ ను దృష్టిలో పెట్టుకునే తాజాగా  కండిషన్ పెట్టిందట. ఆ స్టోరీలోకి వెళితే, ఇటీవల చెర్రీ – సుకుమార్ ల ‘రంగస్థలం’ మూవీ షూటింగ్ సమ్మర్ లో జరిగినప్పుడు సమంతకి వడదెబ్బ తగిలిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ కారణంగా అప్పుడు ఆ షెడ్యూల్ కు బ్రేక్ కూడా పడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అలా జరగకూడదనే సమంత ముందుగానే ఆ తమిళ సినిమాకు కండిషన్ పెట్టేసిందట.
ఈ మేరకు శివకార్తికేయన్ హీరోగా పొన్ రామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రారంభం కాగా, తొలిరోజే డైరెక్టర్ తో మాట్లాడిన సమంత.. తనకు స్కిన్ ఎలర్జీ ఉందని, ఆ సమస్య ఇంకా ఇబ్బంది పెడుతున్నందుకు తాను ఎండ సీన్లలో నటించే అవకాశం లేదని చెప్పేసిందట. అంతేకాకుండా ఎండ తీవ్రత పెరిగే లోపు తన మీద ఉన్న సీన్స్ అన్నీ పూర్తి చేయాలని, అలాగే ఒక మోస్తరు ఎండ ఉంటే తాను నటించే లొకేషన్ల దగ్గర ఎండ పొర తగలకుండా క్లాత్ తో కవర్ చేయాలని సమంత కండిషన్ పెట్టిందట. చివరగా ఏమాత్రం ఎండ తగిలినా తాను షూటింగ్ లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పేసిందని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు గాని, సదరు డైరెక్టర్ కు సమంత ఈ కండిషన్స్ పెట్టిందని న్యూస్ మాత్రం ఇప్పుడు తెగ చక్కర్లు కొట్టేస్తోంది.