అమ్మాయిల పిచ్చి ఉన్న ఆ డైరెక్టర్ ఎవరు..?

Last Updated on by

శ్రీ‌రెడ్డి పేరు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో మారుమోగిపోతుంది. ప‌దేళ్లుగా ఇండ‌స్ట్రీలోనే ఉన్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌ని ఈ పేరు ఇప్పుడు మాత్రం మారుమోగిపోతుంది. ఎవ‌రీ శ్రీ‌రెడ్డి అంటూ ఇప్పుడు రీస‌ర్చులు చేస్తున్నారు. ప‌నిలో ప‌నిగా ఈమెకు ఫ్రీ ప‌బ్లిసిటీ కూడా వ‌చ్చేస్తుంది. మ‌న ఇండ‌స్ట్రీలో ప‌డుకోక‌పోతే అమ్మాయిల‌కు అవ‌కాశాలు రావు.. ఏదీ జ‌ర‌గ‌దు.. ద‌ర్శ‌కుల నుంచి హీరోల వ‌ర‌కు అంతా బ్రోక‌ర్లే అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయింది శ్రీ‌రెడ్డి. తాజాగా ఈమె ఓ ద‌ర్శ‌కుడిపై కూడా మాట‌ల తూటాలు పేల్చింది. ఓ స్టార్ డైరెక్ట‌ర్ పై శ్రీ‌రెడ్డి నోరు పారేసుకోవ‌డం ఇప్పుడు అంత‌టా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇండ‌స్ట్రీలో పేరు మోసిన ఓ ద‌ర్శ‌కుడు.. వ‌ర‌స‌గా విజ‌యాలు అందుకుంటున్న టాప్ డైరెక్ట‌ర్.. దేశాన్ని మార్చేస్తా.. గ్రామాల్ని మార్చేస్తా.. రాజ‌కీయాల్ని మార్చేస్తా.. మ‌నిషిని మార్చేస్తా అంటూ లెక్చ‌ర్లు ఇచ్చే ఓ స్టార్ డైరెక్ట‌ర్ ముందు త‌న‌ను తాను మార్చుకోవాలంటూ శ్రీ‌రెడ్డి ఫైర్ అవ్వ‌డం.. అత‌డిపై కొన్ని ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారిందిప్పుడు.

పైగా త‌ను ఎవ‌ర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నానో అర్థ‌మౌతుంది క‌దా అంటూ సెటైర్ వేయ‌డం మ‌రో హైలైట్. ఇండ‌స్ట్రీలో చాలామంది అమ్మాయిల‌ను ఆయ‌న వాడుకుంటున్నాడ‌ని డైరెక్ట్ గానే డైరెక్ట‌ర్ గారిపై నోరు పారేసుకుంది శ్రీ‌రెడ్డి. ఈమె కామెంట్స్ తో ఇండ‌స్ట్రీలో ఒక్క‌సారిగా హీట్ పెరిగింది. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రా అని ఆలోచించి.. తీరా బుర్ర‌లో అత‌డు ఎవ‌రో త‌ట్టిన త‌ర్వాత నోటిపై వేలేసుకోవ‌డం చాలా మంది వంత‌వుతుంది ఇప్పుడు. పైకి జెంటిల్మెన్ లా క‌నిపించే ఆ ద‌ర్శ‌కుడులో ఇంత ర‌సికుడు ఉన్నాడా అని షాక్ అవుతున్నారంతా. అవ‌కాశాల పేరుతో మ‌భ్యపెట్టి అమ్మాయిల‌ను ఆయ‌న వాడుకుంటున్నాడ‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి అప్ప‌ట్లో త‌మిళ ఇండ‌స్ట్రీని ఊపేసిన సుచీలీక్స్ మాదిరి.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీని శ్రీ‌లీక్స్ ఊపేస్తున్నాయి.

User Comments