ఫోటో స్టోరి: గొడ్డ‌లి గ్యాంగ్ లో చేరింది!

Last Updated on by

సోష‌ల్ మీడియా క్వీన్ గా పాపుల‌రైంది అదాశ‌ర్మ‌. ఇన్ స్టాగ్ర‌మ్, ట్విట్ట‌ర్ మాధ్య‌మంలో బోయ్స్ ని క‌వ్విస్తూ ఈ అమ్మ‌డు రెగ్యుల‌ర్ గా ఫోటోలు, వీడియోల్ని అప్ లోడ్ చేస్తూ పాపులారిటీ పెంచుకుంది. సినిమాల‌తో కంటే సోష‌ల్ యాక్టివిటీస్ తోనే ఈ అమ్మ‌డు బాగా పాపుల‌రైంది. ఇటీవ‌లే ఓ రోప్ ని ప‌ట్టుకుని వేలాడుతూ ఓ అసాధార‌ణ ఫీట్ వేసిన వీడియోని అదాశ‌ర్మ ట్విట్ట‌ర్ లో షేర్ చేసింది. ఈ వీడియో ట్రీట్ ని మ‌ర్చిపోక ముందే మ‌రికొన్ని అదిరిపోయే ఫోటోల్ని అప్ లోడ్ చేసింది.

ఇందులో ఈ క్యూటీ ఓ గొడ్డ‌లి ప‌ట్టుకుని నించున్న ఫోజు యూత్ కి కిక్కిస్తోంది. యాక్స్ మ‌ర్డ‌ర‌ర్ గ్రీటింగ్స్! అంటూ కామెంట్ ని పోస్ట్ చేస్తూ భేజారెత్తించింది. అంత‌టి చ‌క్క‌న‌మ్మ ఇలా క్రూయెల్ గా గొడ్డ‌లి గ్యాంగ్ లో చేరి స్నేక్ క్వీన్ లా బుస‌లు కొట్ట‌డం న్యాయ‌మా? అంటూ బోయ్స్ ప్ర‌శ్నిస్తున్నారు. అదా కి అదా ట్విట్ట‌ర్ ఈ అమ్మ‌డు వేరొక విష‌యంపైనా క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. నేను ఓ సినిమాలో ఐటెమ్ నంబ‌ర్ లో చేస్తున్నాన‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు. ఇప్ప‌టికి అయితే నేను ఏ ఐటెమ్ నంబ‌ర్ కి సంత‌కం చేయ‌లేదు అని స్ప‌ష్ట‌త‌నిచ్చింది. నాని హీరోగా న‌టిస్తున్న జర్సీ చిత్రంలో అదా ఐటెమ్ నంబ‌ర్ చేస్తోంద‌న్న ప్ర‌చారానికి ఇలా క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింద‌న్న‌మాట‌. మ‌రోవైపు తానకు ఒక్కో సినిమాకి భారీ పారితోషికం అందుతోంద‌న్న ప్ర‌చారం స‌రికాద‌ని అంది. వ‌స్తే మంచిదే క‌దా! అంటూ అదా తెలిపింది. దీనిని బ‌ట్టి పారితోషికం విష‌యంలో ప‌ట్టు విడుపు ఉన్నాయ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ఫీల‌ర్స్ వ‌దిలింద‌న్న‌మాట‌. మొత్తానికి అదా విసిరిన గొడ్డ‌లి సూటిగానే గుచ్చుకుంది. మునుముందు ప‌రిణామాలు ఎలా ఉంటాయో? అన్న‌ట్టు బికినీలు వేసుకుని ఆడాళ్లు బీచ్ ల‌లో ఎందుకు తిరుగుతారు? అంటూ ఓ బండ కూడా విసిరింది. మ‌రి దీనికి మీ స‌మాధాన‌మేంటి?


Related Posts