వీడియో: స‌మ్మ‌ర్ హీట్ డ‌బుల్‌

Last Updated on by

టాలీవుడ్‌లో గ‌త కొన్నేళ్లుగా అవ‌కాశాలు అందుకుంటున్నా.. ఆశించిన స్టార్‌డ‌మ్ మాత్రం అందుకోలేక‌పోయింది అదాశ‌ర్మ‌. ముంబై ప‌రిశ్ర‌మ నుంచి టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ `హార్ట్ ఎటాక్‌`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` సినిమాల‌తో న‌టిగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నా ఎందుక‌నో అగ్ర నాయిక కేట‌గిరీలో చేర‌లేక‌పోయింది. ఆ క్ర‌మంలోనే షాపుల ఓపెనింగులు, రిబ్బ‌ను క‌టింగుల‌తోనే కాల‌క్షేపం చేస్తోంది. మ‌రోవైపు ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ అదా ప్ర‌య‌త్నాలు సాగిస్తోంది. ఇటీవ‌ల‌ త‌మిళంలోనూ అవ‌కాశాలు అందుకుంటోంది. ఓ త‌మిళ చిత్రంలో క్రేజీ ఆఫ‌ర్‌ని అందుకున్నాన‌ని అదా ఇటీవ‌ల సామాజిక మాధ్య‌మాల్లో తెలిపింది.

అవ‌కాశాల మాటేమో కానీ.. అదాశ‌ర్మ కొంటె వేషాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. నిరంత‌రం సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌కు ట‌చ్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ అప్పుడ‌ప్పుడు అల్ల‌రి చిల్ల‌ర వేషాల్ని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. ఈ వీడియోల‌కు యూత్‌లో అద్భుత‌మైన ఫాలోయింగ్ ఉంది. అయితే వాట‌న్నిటినీ మించే ఓ హాట్ ఫోటోషూట్ తాజాగా లైమ్‌లైట్‌లోకొచ్చింది. ఇటీవ‌లే అదాశ‌ర్మ ప్ర‌తిష్ఠాత్మ‌క ఆంగ్ల మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌పేజీ షూట్‌లో పాల్గొంది. ఇప్పుడు ఆ వీడియో యూట్యూబ్‌లో అందుబాటులోకొచ్చింది. ఈ ఫోటోషూట్‌లో నెవ్వ‌ర్ బిఫోర్ అన్న రీతిలో చెల‌రేగిపోయింది. స‌మ్మ‌ర్ హీట్ డ‌బుల్ అయ్యిందా? అనిపించేంత‌గా ఆర‌బోసింది. అందాల ఆర‌బోత‌కు త‌న‌కు ఎలాంటి అభ్య ంత‌రం లేనేలేద‌ని ఇలా అదా చెప్ప‌క‌నే చెప్పింది. ఈ వీడియో చూస్తే మీకే ఆ సంగ‌తి అర్థ‌మ‌వుతుంది. క‌నీసం ఈ ఫోటోషూట్ చూశాక అయినా టాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క‌రుణిస్తారేమో?

User Comments