పిక్ టాక్‌: గుండె జారి గ‌ల్లంత‌య్యిందే

Last Updated on by

అదాకి ఫిదా అవ్వ‌నిది ఎవ‌రు? అందుకే ఈ భామ `అదా కి అదా` పేరుతో ట్విట్ట‌ర్‌లో ప్ర‌వేశించి నిరంత‌రం యువ‌త‌రాన్ని క‌వ్వించే ప‌నిలో ప‌డింది. ఇంకా చెప్పాలంటే కుర్రాళ్లు, టీనేజ‌ర్ల‌ గుండె పిండే ప‌నిలో ప‌డింది. ఆ క్ర‌మంలోనే ఈ భామ అర‌వ తంబీల నుంచి.. టాలీవుడ్‌లో త‌న‌కు ఎదురైన హాఫ్ ఇంగ్లీష్ నాలెజ్‌ డైరెక్ట‌ర్ల‌ను ఓ రేంజులో ఆడుకుంది. వాళ్ల‌పై విరుచుకుప‌డి త‌న‌దైన శైలిలో కామెడీలు చేసింది. ఇటీవ‌లి కాలంలో డ్యాన్సింగ్ వీడియోల్ని పోస్ట్ చేసి, ఇలా డ్యాన్స్ చేయాలి అంటూ టిప్స్ కూడా చెబుతోంది.

adasharma stunning look

తాజాగా అదాశ‌ర్మ ఓ అంద‌మైన ముఖార‌విందాన్ని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. డిజైన‌ర్ డ్రెస్‌లో .. చున్నీలోని కొత్తందాల్ని ప‌రిచ‌యం చేసింది. ఆకులు, అల‌ములు, అంద‌మైన పుష్కాల‌తో ఉన్న‌ ఈ డిజైన్ అబ్బో.. కుర్రాళ్ల గుండె న‌రం ప‌ట్టి లాగేసిందంటే న‌మ్మండి! అందుకే కుర్రాళ్లంతా గుండె జారి గ‌ల్లంతయ్యిందే! అంటూ సాంగేసుకుంటున్నారు. కొంటె అదాకి సంద‌ర్భం దొర‌కాలే కానీ అస్స‌లు విడిచిపెట్ట‌దు. వెంటాడి వేదిస్తుంది. ఇంకా చెప్పాలంటే కుర్రాళ్ల‌ను వేటాడుతుంది. అయితే ఇలా చేయ‌డం వెన‌క కూడా బిజినెస్ లెక్క‌లున్నాయి సుమీ! ఇలా చేస్తేనే కుర్రాళ్లు సామాజిక మాధ్య‌మాల్లో క‌నెక్ట‌య్యేది. లైక్‌లు, క్లిక్కులు కొట్టేది. అలా చేస్తేనే త‌న‌కు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తో ఆదాయం సాముపార్జించ‌గ‌ల‌దు! అందుకే నిరంత‌రం ఇలా వేడెక్కించే చేష్ట‌ల‌తో అదా అట్టుడికిస్తోంది. అస‌లు సంగ‌తి అర్థ‌మైంది క‌దూ?

User Comments