అమెరికాలో అడ‌వి శేషుదే అప్ప‌ర్ హ్యాండ్

అడవిశేషు క‌థానాయ‌కుడిగా న‌టించిన ఎవ‌రు, శ‌ర్వానంద్ న‌టించిన ఎవ‌రు, ర‌ణ‌రంగం స్వాతంత్ర్య దినోత్సవం సంద‌ర్భంగా ఆగ‌స్టు 15న బాక్సాఫీస్ బ‌రిలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. రెండు సినిమాల‌కు పాటిటివ్ టాక్స్ వ‌చ్చాయి. కానీ ర‌ణ‌రంగం క‌న్నా ఎవ‌రు చిత్రానిదే అప్ప‌ర్ హ్యాండ్. అమెరికాలో వ‌సూళ్ల ప‌రంగా ఎవ‌రు రెయిజింగ్ లో ఉంది. బుధ‌వారం ఎవరు యూఎస్ లో ప్రీమియర్స్ ద్వారా $61,499 గ్రాస్ వసూళ్లు సాధించి ట్రేడ్ కు షాక్ ఇచ్చింది. అడివి శేషు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా నిలిచింది. ఇక గురువారం $43,320 గ్రాస్ సాధించిందని సమాచారం. తాజాగా అందిన రిపోర్ట్ ప్రకారం ఇప్పటివరకు ఎవరు చిత్రం యూఎస్ లో $1,21,822 గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

శర్వా రణరంగం యూఎస్ లో వర్కవుట్ కాలేదు. యూఎస్ ప్రీమియర్స్ లేకపోవడం ఈ మూవీ వసూళ్లపై చాలా ఎఫెక్ట్ చూపించిందని తెలుస్తోంది. గురువారం $24,014 గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక తాజాగా అందిన లెక్కల ప్రకారం ఇప్పటివరకు రణరంగం కేవలం $27,892 గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టినట్టు స‌మాచారం.