తెలుగులో ఎప్పుడు అదురుతుంది..?

త‌మిళ‌నాట ఇప్ప‌టికే ఎక్క‌డ విన్నా మెర్స‌ల్ పైనే చ‌ర్చ న‌డుస్తుంది. ఈ చిత్రం సృష్టిస్తోన్న సంచ‌ల‌నాలు అలా ఉన్నాయి మ‌రి. దాంతో తెలుగులో కూడా ఈ చిత్రంపై ఆస‌క్తి మొద‌లైంది. పైగా బిజేపీ చేస్తోన్న ఫ్రీ ప‌బ్లిసిటీ కూడా సినిమాకు హెల్ప్ అవుతుంది.

అందుకే విజ‌య్ సినిమాల‌పై తెలుగు మార్కెట్ లో పెద్ద‌గా క్రేజ్ లేక‌పోయినా.. అదిరింది మాత్రం ఎప్పుడొస్తుందా అని వేచి చూస్తున్నారు ప్రేక్ష‌కులు. త‌మిళ్ లో ఇప్ప‌టికే 130 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. తెలుగులో శ‌ర‌త్ మ‌రార్ విడుద‌ల చేస్తున్నారు ఈ చిత్రాన్ని. ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకోవాల్సి ఉన్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు అది పూర్తి కాలేదు.

చూస్తుంటే తెలుగులో కావాలనే అదిరింది విడుద‌ల ఆపేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక్క‌డ సెన్సార్ కానీయ‌కుండా గ‌త వారం రోజులుగా తిప్ప‌లు పెడుతున్నారు. అందుకే కోర్ట్ కు వెళ్లాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు నిర్మాత‌లు. తెలుగు నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ కూడా ఇదే ఆలోచిస్తున్నారు. కావాల‌నే త‌మ సినిమా సెన్సార్ పూర్తి చేయ‌డం లేద‌నేది ఆయ‌న వాద‌న‌.

సినిమాల‌ను రాజ‌కీయాల్లోకి లాగొద్ద‌ని.. రెండూ వేర్వేరుగా చూడాల‌ని కొంద‌రు హిత‌వు పలుకుతున్నా కూడా మార‌ట్లేదు. అదిరింది అక్టోబ‌ర్ 19నే విడుద‌ల కావాల్సింది. ఇప్పుడు 27 అంటున్నారు. కానీ ప‌రిస్థితులు చూస్తుంటే ఈ వారం కూడా వ‌చ్చేలా క‌నిపించ‌ట్లేదు. మ‌రోవైపు శ‌ర‌త్ మ‌రార్ కు కూడా ఇది న‌ష్ట‌మే. ఇదే ఊపులో వ‌చ్చుంటే తెలుగులో సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వ‌చ్చుండేవి. చూడాలిక‌.. అదిరింది తెలుగులో ఎప్పుడు అదురుతుందో..?

Follow US