RRR.. న‌వాబ్ గాళ్‌ని ప‌ట్టేశారా?

Last Updated on by

రాజ‌మౌళి – రామ్ చ‌ర‌ణ్‌- రామారావు కాంబినేష‌న్ మూవీ RRR ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే రెండో షెడ్యూల్ ప్రారంభించారు జ‌క్క‌న్న. ఈ సినిమా కోసం సెట్స్ వేసి, ఆన్ లొకేష‌న్ ఇల్లు క‌ట్టుకుని మ‌రీ జ‌క్క‌న్న త‌ప‌స్సు చేస్తున్నాడు. రెండో షెడ్యూల్ ప్రారంభానికి ముందే రూ.150 కోట్ల మేర శాటిలైట్‌ రైట్స్ కోసం జీ చానెల్ ఆఫ‌ర్ చేయడం పెద్ద షాకిచ్చింది. తెలుగు, త‌మిళం, హిందీ శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ కోసం అంత పెద్ద మొత్తం ఆఫ‌ర్ చేసిందిట‌. అయితే దాన‌య్య ఆ ఆఫ‌ర్ తో సంతృప్తిగా లేర‌ని, 200కోట్లు డిమాండ్ చేశార‌ని వార్త‌లొచ్చాయి.

ఓవైపు ఇంత జ‌రుగుతున్నా.. ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో న‌టించే క‌థానాయిక‌లు ఎవ‌రు? అన్న‌దానికి ఇప్ప‌టికీ ఆన్స‌ర్ రాలేదు. ద‌ర్శ‌కుడు క‌థానాయిక‌ల్ని వెతుకుతూనే ఉన్నారు. ఓవైపు కీర్తి సురేష్, దీపిక ప‌దుకొనే, ఆలియా భ‌ట్ వంటి పేర్లు వినిపించాయి. కానీ ఎవ‌రినీ ఫైన‌ల్ చేయ‌లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. హైద‌రాబాదీ సోగ్గ‌త్తె .. `న‌వాబ్` నాయిక అదితీరావ్ హైద‌రీ ని జ‌క్క‌న్న లాక్ చేశాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. గ‌త చిత్రాల్లో అదితీ హావ‌భ‌వాలు, న‌ట‌నాభిన‌యానికి ముగ్ధుడైపోయిన రాజ‌మౌళి త‌న‌కో అద్భుత‌మైన పాత్ర‌ను ఆఫ‌ర్ చేశాడ‌ట‌. అయితే త‌ను ఎవ‌రి స‌ర‌స‌న న‌టిస్తుంది? అన్న‌దానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక‌పోతే అదితీ న‌టించిన స‌మ్మోహ‌నం గ‌త ఏడాది రిలీజై విజ‌యం సాధించింది. మ‌ణిర‌త్నం న‌వాబ్ లో వేడెక్కించే న‌ట‌న‌తో అగ్గి రాజేసింది. అందుకే జ‌క్క‌న్న స్పెల్ బౌండ్ అయిపోయాడ‌న్న మాటా వినిపిస్తోంది.

User Comments