మహబూబ్ నగర్ పిల్ల హాట్ గురూ!

Last Updated on by

అదితీరావ్ హైదారీ అంత‌గా ప‌రిచ‌య అఖ్క‌ర్లేని పేరు ఇది. మణిరత్నం `చెలియా` సినిమాతో తెలుగు, త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌రిచ‌య‌మైన అదితీ తొలుత బాలీవుడ్‌లో క‌థానాయిక‌గా తొలి అడుగులు వేసింది. అటుపై సౌత్‌లో బిజీ క్వీన్‌గా మారింది. హైద‌రాబాదీ మూలాలు ఉన్న ఈ అందాల నాయిక ముంబై ప‌రిశ్ర‌మ‌లో క్రేజీ అవ‌కాశాలు అందుకుంటూనే, ఇటు ద‌క్షిణాదినా తిరుగులేని నాయిక‌గా ఎదిగేందుకు ప్ర‌ణాళిక‌లు వేస్తోంది. ఇప్ప‌టికే యువ‌త‌రం హీరో సుధీర్ బాబు స‌ర‌స‌న ఓ అవ‌కాశం అందుకుంది. ఈ సినిమా త‌న కెరీర్‌కి పెద్ద సాయం అవుతుంద‌ని ఆశిస్తోంది.

ఓవైపు కెరీర్ బండి న‌డిపిస్తూనే, వీలున్న‌పుడ‌ల్లా క‌వ‌ర్‌పేజీల‌కెక్కి వేడి పెంచేస్తోంది. ఇండ‌స్ట్రీ బెస్ట్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌పేజీల‌పై ద‌ర్శ‌న‌మిస్తూ తన ఉనికిని చాటుకుంటోంది. ప్ర‌స్తుతం ప్ర‌ఖ్యాత వోగ్ ఇండియా క‌వ‌ర్‌పేజీపై వేడెక్కించే లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ ఫోటోలో న్యూ అప్పియ‌రెన్స్‌ యువ‌త‌రం వాట్సాప్‌లు, సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అయిపోతోంది. హైద‌రాబాద్ న‌వాబుల నుంచి వార‌సురాలు అంటే ఆ లెవ‌ల్లో ఉంటుంద‌ని అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌ల ప‌ద్మావ‌త్‌లో ఖిల్జీ స‌ర‌స‌న న‌టించి యూత్‌ని కిల్ చేసిన ఈ కిల్లాడి నాయిక‌.. ట‌బు త‌ర‌వాత మ‌ళ్లీ ఆ వారసత్వం నిల‌బెట్టే మేటి నాయిక‌గా వెలిగిపోతోంది. ఇప్ప‌టికి మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌పేజీపై అదితీ గ్లింప్స్ క్యాచ్ ప్లీజ్‌!

User Comments