అదితి స‌మ్మోహ‌నమైన ప‌లుకులు

Last Updated on by

పేరుకు తెలుగ‌మ్మాయే.. కానీ తెలుగు రాదు. దానికి కార‌ణం ఇక్క‌డ పుట్ట‌లేదు.. పెర‌గ‌లేదు. దాంతో తెలుగుకు పూర్తిగా దూరంగానే ఉంది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ మాతృభాష‌కు చేర‌వ‌వుతుంది అదితిరావ్ హైద్రీ. ఈమె హైద‌రాబాదీ పిల్లే. కాక‌పోతే చిన్న‌ప్ప‌ట్నుంచీ ముంబైలో పెర‌గ‌డంతో తెలుగుకు దూరంగానే ఉంది. ఇకిప్పుడు తెలుగులోనూ ఈమె వ‌ర‌స‌గా సినిమాలు చేస్తుంది. ఇప్ప‌టికే సుధీర్ బాబు హీరోగా న‌టిస్తున్న స‌మ్మోహ‌నంలో న‌టిస్తుంది అదితిరావ్. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో నిజంగానే హీరోయిన్ పాత్ర‌లో న‌టిస్తుంది అదితి. ఇందులో సొంత డ‌బ్బింగ్ చెప్పుకుంటుంది ఈ భామ‌.

తెలుగుతో అస్స‌లు ప‌రిచ‌యం లేక‌పోయినా కూడా భావం అర్థం చేసుకుని మ‌రీ డ‌బ్బింగ్ మొద‌లుపెట్టింది అదితి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వ‌చ్చాయి. టీజ‌ర్ లోనే అదితి వాయిస్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు సినిమా మొత్తం ఆమె చెబితే క‌చ్చితంగా అది బాగా హెల్ప్ అవుతుంద‌న‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. ఎందుకంటే అదితి మంచి న‌టి మాత్ర‌మే కాదు.. మంచి సింగ‌ర్ కూడా. దాంతో స‌మ్మోహ‌నంలో త‌న గాత్రంతో అంద‌ర్నీ స‌మ్మోహ‌న‌ప‌ర‌చ‌డానికి సిద్ధంగా ఉంది ఈ ముంబై కాని ముంబై ముద్దుగుమ్మ‌.

User Comments