అఖిల్ కు క్లారిటీ వ‌చ్చేసిందోచ్

Last Updated on by

ఒక్కోసారి ఫ్లాప్ సినిమాలు కూడా మ‌న‌కు జ్ఞానోద‌యం క‌లిగిస్తాయి. ఇప్పుడు అఖిల్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఈయ‌న‌కు అఖిల్ సినిమాతో ఎలాంటి సినిమాలు చేయ‌కూడ‌దో అర్థ‌మైంది.. హ‌లో సినిమాతో ఎలాంటి సినిమాలు చేయాలో క్లారిటీ వ‌చ్చింది. కానీ రెండు ఫ్లాప్ సినిమాలే. అయితే ఒక‌టి మాత్రం అఖిల్ కు క్లారిటీ ఇచ్చిన సినిమా. హ‌లో సినిమా ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ ఖచ్చితంగా ఇది అఖిల్ లా విమ‌ర్శ‌లు మాత్రం తీసుకురాలేదు. సినిమాకు మంచి టాక్ వ‌చ్చినా కూడా ఆ టైమ్ లో ఉన్న ఇత‌ర సినిమాల వల్ల హ‌లో ఆడ‌లేదు. దానికితోడు బ‌డ్జెట్ కూడా భారీగా పెట్ట‌డం హ‌లోకు శాపంగా మారింది. దాంతో ఈ సినిమా ఆడ‌లేదంతే కానీ అఖిల్ న‌ట‌న‌కు మాత్రం మంచి మార్కులు ప‌డ్డాయి. హ‌లో ఇచ్చిన న‌మ్మ‌కంతోనే ఇప్పుడు మ‌రోసారి ప్రేమ‌క‌థ‌తోనే ముందుకెళ్తున్నాడు ఈ హీరో.

అఖిల్ మూడో సినిమాపై ఉగాది రోజు క్లారిటీ వ‌చ్చింది. తొలిప్రేమ‌తో మంచి విజ‌యం అందుకున్న వెంకీ అట్లూరితో అఖిల్ మూడో సినిమా క‌న్ఫ‌ర్మ్ అయింది. ఆ సినిమాను నిర్మించిన బివిఎస్ఎన్ ప్ర‌సాదే ఈ చిత్రానికి కూడా నిర్మాత‌. ఉగాకి కానుక‌గా ఈ సినిమాపై అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌చ్చేసింది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ప్ర‌స్తుతం వెంకీ పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసే ప‌నిలో ఉన్నాడు. ఇదివ‌ర‌కే అఖిల్ తో వెంకీ సినిమా చేయాల్సి ఉంది. కానీ అప్పుడు ఈయ‌న‌పై న‌మ్మ‌కం లేకో.. లేదంటే చెప్పిన క‌థ న‌చ్చ‌కో ప‌ట్టాలెక్క‌లేదు. ఇప్పుడు దానికి మోక్షం వ‌చ్చింది. మే నుంచి ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. మొత్తానికి హ‌లోతో ప్రేమ మూడ్ లోకి వ‌చ్చిన అఖిల్.. తొలిప్రేమ‌తో అదే మూడ్ లో ఉన్న వెంకీ అట్లూరి.. ఇద్ద‌రూ క‌లిసి ఇండ‌స్ట్రీని ఎలాంటి మాయ చేస్తారో చూడాలి.

User Comments