అందర్నీ మ్యూజియంలో పెడుతున్నారు..

Last Updated on by

అరుదైన వ‌స్తువుల‌ను.. చరిత్ర సృష్టించిన వాటిని మాత్ర‌మే మ్యూజియ‌మ్స్ లో పెడ‌తారు. ఇప్పుడు మ‌న హీరోలు కూడా అరుదైన ర‌కాలుగా మారిపోతున్నారు. అందుకే అంద‌ర్నీ తీసుకెళ్లి మ్యూజియ‌మ్స్ లో పెడుతున్నారు. మేడ‌మ్ తుస్సాడ్స్ కానీ లండ‌న్ మ్యూజియ‌మ్స్ కానీ ఇవ‌న్నీ మ‌న వ‌ర‌కు ఎప్పుడూ రాలేదు. అన్నీ బాలీవుడ్ హీరోలే ప‌ట్టుకుని వెళ్లిపోయేవారు. అక్క‌డే షారుక్.. స‌ల్మాన్.. దీపిక‌.. క‌త్రినా అంటూ వాళ్ల విగ్ర‌హాల‌నే మ్యూజియ‌మ్స్ లో పెట్టేవాళ్లు. కానీ ఇప్పుడు మ‌న‌కేం త‌క్కువ‌. అందుకే మ‌న హీరోలు కూడా మ్యూజియ‌మ్స్ లో చోటు ద‌క్కించుకుంటున్నారు. అంద‌రికంటే ముందు నేనున్నానంటూ మేడ‌మ్ తుస్సాడ్స్ వైపు అడుగేసాడు ప్ర‌భాస్.After Prabhas Mahesh Babu Statue at Madame Tussauds Museumబాలీవుడ్ కు కూడా తెలుగు హీరోల స‌త్తా చూపించింది ఈ హీరోనే క‌దా.. అందుకే ఈయ‌న్ని సృష్టించిన రాజ‌మౌళిని కూడా వ‌దిలేసి ముందు ప్ర‌భాస్ కొల‌త‌లు తీసుకెళ్లి తుస్సాడ్స్ లో మ‌నోడి విగ్ర‌హాన్ని పెట్టేసారు. ఇప్పుడు తెలుగు నుంచి మ‌రో హీరో కూడా అక్క‌డికి వెళ్తున్నాడు. అత‌డే మ‌హేష్ బాబు. ఈయ‌న‌కు కూడా తుస్సాడ్స్ లో నిల‌బ‌డే ల‌క్ దొరికింది. తాజాగా వ‌చ్చి సూప‌ర్ స్టార్ కొల‌త‌లు కూడా తీసుకెళ్ళిపోయారు స‌ద‌రు మ్యూజియ‌మ్ వాళ్లు. మ‌హేష్ కంటే రెండు రోజుల ముందు క‌ర‌ణ్ జోహార్ కొల‌త‌లు కూడా తీసుకెళ్లిపోయారు. మొత్తానికి ఇన్నాళ్లూ బాలీవుడ్ కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన మ్యూజియ‌మ్ ద‌ర్శ‌నాలు ఇప్పుడు తెలుగు హీరోల‌కు కూడా దొరుకుతుండ‌టం గొప్ప విష‌య‌మే.

User Comments