అజ్ఞాత‌వాసి ఓవర్సీస్ లో ఎంత నష్టం?

Last Updated on by

2 మిలియ‌న్.. ఓవ‌ర్సీస్ లో తెలుగు సినిమా క‌ల‌గ‌నే టార్గెట్ ఇది. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా త‌క్కువ సినిమాలు మాత్ర‌మే అక్క‌డ 2 మిలియ‌న్ మార్క్ అందుకున్నాయి. ఇప్పుడు అజ్ఞాత‌వాసి కూడా ఈ లిస్ట్ లోకి అడుగు పెట్టింది. కానీ 2 మిలియ‌న్ వ‌సూలు చేసింద‌ని సంతోష‌ప‌డాలో.. లేదంటే సినిమా డిజాస్ట‌ర్ అయింద‌ని బాధ ప‌డాలో తెలియ‌ని ప‌రిస్థితుల్లో ప‌డిపోయారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ చిత్రం అక్క‌డ దాదాపుగా 25 కోట్లకు కొన్నారు. అంటే ఈ సినిమా సేఫ్ అవ్వాల‌న్నా క‌నీసం 4.5 మిలియ‌న్ వ‌సూళ్లు సాధించాలి. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 28 కోట్లు.

కానీ ఇప్పుడు ప‌రిస్థితి చూస్తుంటే 2 మిలియ‌న్ దాటి పైకి వెళ్లేలా క‌నిపించ‌ట్లేదు ఈ చిత్రం. ప్రీమియ‌ర్స్ తోనే 1.5 మిలియ‌న్ డాల‌ర్స్ దాటి బాహుబ‌లి 2 త‌ర్వాత రెండో తెలుగు సినిమాగా చ‌రిత్ర సృష్టించాడు ప‌వ‌ర్ స్టార్. ఆ త‌ర్వాత సినిమా టాక్ తేడాగా రావ‌డంతో పూర్తిగా వెన‌క‌బ‌డిపోయాడు. వారం రోజుల్లో కేవ‌లం 5 ల‌క్ష‌ల డాల‌ర్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఇప్పుడు అజ్ఞాత‌వాసి ప్ర‌యాణం చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఈ చిత్రం మ‌హా అయితే మ‌రో 2 ల‌క్ష‌ల డాల‌ర్లు కూడా వ‌సూలు చేసేలా క‌నిపించ‌ట్లేదు. మొత్తానికి ఇంటా బ‌య‌టా అజ్ఞాత‌వాసి బ‌య్య‌ర్లను భారీగా ముంచేస్తున్నాడ‌న్న‌మాట‌.

User Comments