అజ్ఞాత‌వాసి.. ఈ పాపం ఎవ‌రిది..?

ఆకాశ‌మంత అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన సినిమాకు నెగిటివ్ టాక్ వ‌చ్చింది. అజ్ఞాత‌వాసి ఇప్పుడు అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు కూడా షాక్ ఇచ్చింది. అస‌లు త్రివిక్ర‌మ్ లాంటి ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని ఇలా తెర‌కెక్కిస్తాడ‌ని ఎవ‌రూ క‌ల‌లో కూడా ఊహించ‌లేదు. అస‌లు ఓ థీమ్ అంటూ లేకుండా వ‌చ్చిన అజ్ఞాత‌వాసిని చూసి అభిమానులు మౌనంగా రోదిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి హీరో నుంచి ఇలాంటి స‌మ‌యంలో ఇది రావాల్సిన సినిమానా అంటూ నిల‌దీస్తున్నారు వాళ్లు..! పైగా సినిమాలో ప‌వ‌న్ వేసిన ఆ వేషాలు చూసి అరే.. అస‌లు ఇదేంటి ఇలా చేస్తున్నాడు అంటున్నారు. దానికితోడు చిన్న‌పిల్లాడిలా మాట్లాడ‌టం.. సినిమా అంతా క‌నీసం డ్ర‌స్ కూడా న‌ల‌గ‌కుండా ఆయ‌న చేసిన ఫైట్లు.. జుట్టు చెర‌క్కుండా ఆయ‌న చూపించిన డాన్సుల భంగిమలు ఇవ‌న్నీ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

అస‌లు విష‌యం ఏంటంటే.. అజ్ఞాత‌వాసి ఫ‌లితానికి అస‌లు కార‌ణం ఏంటి అని..? ఈ లోపం ప‌వ‌న్ లో ఉందా.. లేదంటే త్రివిక్ర‌మ్ లో ఉందా..? క‌నీసం చూసుకోలేదా..? ఇంత ప్ర‌స్టేజియ‌స్ ప్రాజెక్ట్.. పైగా 120 కోట్ల బిజినెస్ చేసిన సినిమాను ఇంత దారుణంగా ఎలా తీస్తారు.. అని ప్ర‌శ్నిస్తున్నారు ఇప్పుడు మ‌న‌సు మండిన అభిమానులు. ప‌వ‌న్ 25వ సినిమా క‌దా అని కోట్లాది ఆశ‌ల‌తో వ‌చ్చిన అభిమానుల ఆశ‌ల‌పై నిండా నీళ్లు పోసారు ప‌వ‌న్ అండ్ త్రివిక్ర‌మ్. ఏం చేసినా చూస్తారులే అనే అతి విశ్వాస‌మే ఇప్పుడు అజ్ఞాత‌వాసి కొంప ముంచేసిందేమో అనిపిస్తుంది కాస్త లోతుగా జాగ్ర‌త్త‌గా ఆలోచిస్తే..! ఈ పాపం ఎవ‌రిది అయినా కానీ ఇప్పుడు మునిగేది మాత్రం బ‌య్య‌ర్లే. మ‌రి ఈ చిత్రం సంక్రాంతి సీజ‌న్ ని యూజ్ చేసుకుని ఎన్ని కోట్లు తెస్తుందో..?