ఐరా మూవీ రివ్యూ

Last Updated on by

నటీనటులు : న‌య‌న‌తార, క‌ళైరాస‌న్
బ్యానర్: కెజెఆర్ స్టూడియోస్
నిర్మాత: కె. జె.రాజేష్‌
సంగీతం: కె.ఎస్.సుంద‌ర మూర్తి
ఎడిటింగ్‌: కార్తీక్ జోసెఫ్‌
కెమెరా: సుద‌ర్శ‌న్ శ్రీ‌నివాస్
రచన- దర్శకత్వం: షార్జున్
రిలీజ్ తేదీ: 28-03-2019

ముందు మాట:
త‌లైవి (నాయ‌కి) గా త‌మిళ ప్రేక్ష‌కుల చేత మెప్పు పొందింది న‌య‌న‌తార‌. తాను న‌టించే సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్‌స్టార్ల కు ధీటుగా ప్ర‌భంజ‌నం సృష్టించ‌డం ఖాయ‌మ‌ని ప్రూవ్ చేశారు. అందుకే న‌య‌న్ న‌టించిన తాజా చిత్రం `ఐరా` పైనా భారీ అంచ‌నాలేర్పడ్డాయి. పైగా ఈ చిత్రంలో న‌య‌న్ రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో విభిన్న‌మైన రూపాల్లో క‌నిపిస్తూ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచారు. నాయికా ప్రాధాన్య‌త‌, హార‌ర్ బ్యాక్ డ్రాప్ మూవీ `ఐరా` నేడు థియేట‌ర్ల‌లోకి విడుద‌లైంది. అయితే ఈ సినిమా తెలుగు ఆడియెన్ ని ఏమేర‌కు మెప్పించింది? అన్న‌ది తెలియాలంటే ఈ స‌మీక్ష చ‌ద‌వాల్సిందే.

కథనం అనాలిసిస్:
బ‌ల‌వంత‌పు పెళ్లి నుంచి ఎస్కేప్ అవ్వాల‌నుకున్న య‌మున (న‌య‌న‌తార‌) మామ్ డాడ్ నుంచి స్కిప్ కొట్టి.. త‌న నాయ‌న‌మ్మ విలేజ్ కి వ‌చ్చేస్తుంది. అదో పాత బంగ్లా.. దాంతో అక్క‌డ త‌న‌కో ఐడియా వ‌స్తుంది. దెయ్యాలున్నాయి అన్న‌దానిని లైవ్ గా జ‌నాల‌కు చూపిస్తే ఎలా ఉంటుంది? అన్న ఐడియాతో కొన్ని వీడియోల్ని చిత్రీక‌రించి యూట్యూబ్ లో పెడుతుంది. అయితే ఆ షూటింగ్ జ‌రిగే స‌మ‌యంలో అస‌లైన దెయ్యాల అలికిడి మొద‌ల‌వుతుంది. అక్క‌డ త‌మ చిత్ర‌యూనిట్ కి తెలియ‌కుండా కొన్ని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. అయితే ఆ ఊహాతీత‌మైన (పారానార్మ‌ల్) యాక్టివిటీస్ కి కార‌ణ‌మేంటి? అస‌లైన దెయ్యం య‌మున & టీమ్ నే ఎందుకు టార్గెట్ చేసింది? అన్న‌ది తెలియాలంటే ఐరా సినిమా చూడాల్సిందే. ఈ కథ‌లో న‌ల్ల‌మ్మాయ్ ఎవ‌రు? అన్న ట్విస్టు తెర‌పైనే చూడాలి.

అయితే ఈ క‌థ‌లో ప్ర‌ధాన పాత్ర‌ధారి విష‌యంలో ఏం జ‌రుగుతోంది అన్న టెన్ష‌న్ క్రియేట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడ‌నే చెప్పాలి. ప్ర‌థ‌మార్థంలో ఏవో కొన్ని మూవ్ మెంట్స్ మాత్రమే ఉత్కంఠ పెంచుతాయి. ప్రారంభ‌మే ఈ సినిమా క‌థ‌లో గ్రిప్ పెంచ‌డంలో వైఫ‌ల్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. క‌థ‌ని అన‌వ‌స‌రంగా సాగ‌తీశాడా? అన్న సందేహాలు క‌లుగుతాయి. హార‌ర్ సినిమా ఉద్ధేశాన్ని వంద శాతం స‌ద్వినియోగం చేయ‌డంలో అస్స‌లు ప‌నిత‌నం క‌నిపించ‌దు. ద్వితీయార్థం పూర్తిగా ఫెయిలైంది. రివెంజ్ డ్రామా అన్న కోణం పూర్తిగా ఫెయిలైంది.

నటీనటులు:
ర‌చ‌యిత బ‌ల‌మైన పాత్ర‌ల్ని రాసుకున్న‌ప్పుడే సినిమాలో గ్రిప్ ఉంటుంది. అయితే ఈ చిత్రంలో న‌య‌న‌తార పెర్ఫామెన్స్ గురించి ప్ర‌శంసించి తీరాల్సిందే. భ‌వానీ పాత్ర‌లో న‌య‌న్ న‌ట‌న ఫెంటాస్టిక్. ఇక‌పోతే వేరొక పాత్ర‌ను ర‌చ‌యిత టోన్ డౌన్ చేసి అంత గ్రిప్పింగ్ గా ఆవిష్క‌రించ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. క‌ళైస‌ర‌న్ పాత్ర డీసెంట్. యోగి బాబు పాత్ర అంతంత మాత్ర‌మే.

టెక్నికాలిటీస్:
ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌గా షార్జున్ ప‌నిత‌నం తేలిపోయింది. హార‌ర్ సినిమాకి క‌థ‌నాన్ని ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్ద‌డంలో అత‌డు విఫ‌ల‌మ‌య్యాడ‌నే చెప్పాలి. పాత్ర‌ల్ని రాసుకున్న తీరు సోసోనే. సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార స్థాయిని ఎలివేట్ చేయ‌లేక‌పోయాడు. సుంద‌ర మూర్తి రీరికార్డింగ్ సినిమాకి ప్ల‌స్. విజువ‌ల్ గా కొన్ని సీన్లు అద్భుతం. కార్తీక్ ఎడిటింగ్ మ‌రింత బెట‌ర్ గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువ‌లు జ‌స్ట్ ఓకే.

ప్లస్ పాయింట్స్:
*భ‌వానీ పాత్ర‌లో న‌య‌న్ న‌ట‌న‌
* రీరికార్డింగ్

మైనస్ పాయింట్స్:
* థ్రిల్ క‌లిగించ‌లేక‌పోవ‌డం
* ద్వితీయార్థం (సెకండాఫ్) ఫెయిల్

ముగింపు: త‌లైవి రేంజ్ అని ఆశిస్తే భంగ‌పాటు.. హార‌ర్ ప్రియుల‌కు నిరాశ త‌ప్ప‌దు..

రేటింగ్:
2.0/ 5


Related Posts