పండోరా ప‌క్షి దారి త‌ప్పిన‌ట్టుందే!

కేన్స్‌లో భార‌తీయ సుంద‌రీమ‌ణుల అంద‌చందాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నాయి. దీపిక‌ప‌దుకొన్, కంగ‌న మెరుపులు ప్ర‌త్యేక శోభ‌ను తెచ్చాయి. ఈసారి మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ మెరుపులు అంతే స్పెష‌ల్‌గా చూప‌రుల‌ను క‌ట్టిప‌డేశాయి.
ముఖ్యంగా ఐశ్వ‌ర్యారాయ్ ధ‌రించిన ఓ ప్ర‌త్యేక‌మైన డిజైన‌ర్ వేర్‌పై ప్ర‌పంచం క‌ళ్ల‌న్నీ వాలిపోయాయి. ఓవైపు కెమెరా ఫ్లాష్‌ల మ‌ధ్య మెరుపులా ర్యాంప్ వాక్ చేసిన ఐష్‌.. ఆ ప‌రిస‌రాల్లో ఉన్న‌వాళ్ల‌ని క‌ళ్లు తిప్పుకోనివ్వ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. అవ‌తార్ – పండోరా గ్ర‌హం నుంచి `ఇక్రాన్‌` ప‌క్షి ఎగురుకుంటూ కేన్స్‌లో వాలిందా?  పండోరా ప్ర‌జ‌ల ప్ర‌త్యేక ప‌క్షి వాహ‌నం దారి త‌ప్పి ఇలా వ‌చ్చిందా? అన్నంత అందంగా క‌నిపించింది. ఐష్ ధ‌రించిన ఆ డిజైన్‌కి పండోరా గ్ర‌హంపై ప‌క్షి ఇక్రాన్ రూపురేఖ‌ల‌కు మ‌ధ్య పోలిక‌లు క‌నిపించాయి. ఈ డిజైన్‌ని ప్ర‌త్యేకంగా రూపొందించేందుకు దుబాయ్‌కి చెందిన మైఖేల్ సిన్సినో అనే డిజైన‌ర్‌ని బ‌రిలో దించారు. వ‌రుస‌గా 17వ సంవ‌త్స‌రం ఐష్ కేన్స్ ఉత్స‌వాల్లో పాల్గొంది. ఈసారి త‌న‌తో పాటే బుల్లి ఆరాధ్య క్యాట్ వాక్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఆరాధ్య ఎరుపు రంగు దుస్తుల్లో క‌నిపించి ఆక‌ట్టుకుంది. ఐష్‌తో ఆరాధ్య క‌లిసి క్యాట్ వాక్ చేస్తున్న కొన్ని సెక‌న్ల స్లోమోష‌న్ క్లిప్ సామాజిక మాధ్య‌మాల్ని హోరెత్తిస్తోందంటే న‌మ్మండి.