ఇన్‌స్టాగ్ర‌మ్ నేటితో ధ‌న్యోష్మి!

Last Updated on by

అంద‌గ‌త్తెలు ఎంద‌రు ఉన్నా అంద‌రూ ఒకెత్తు అనుకుంటే.. ఐశ్వ‌ర్యారాయ్ ఒక్క‌త్తె ఒకెత్తు. ఆ నీలిక‌ళ్ల సౌంద‌ర్యాన్ని వ‌ర్ణించ‌డానికి క‌వులు స‌రిపోరు. ఆ మేనిశిరుల‌ను వ‌ర్ణించేందుకు సామాన్య క‌వులు అస‌లే స‌రితూగ‌రు. దివినుంచి దిగి రావాలి. శ్రీ‌కృష్ణ దేవ‌రాయ‌లు అంత‌టివారే మ‌ళ్లీ పుట్టాలి. కానీ త‌న‌దైన అందంతో ఐశ్వ‌ర్యారాయ్ కాళిదాసుల‌కే క‌విత్వం నేర్పించ‌గ‌లిగింది. అలాంటి ధేధీప్య‌మాన‌మైన సౌంద‌ర్యం అస‌లు ఇల‌లో వేరొక‌రు లేనేలేరంటే అతిశ‌యోక్తి కానేకాదు. ఒక బిడ్డ త‌ల్లి అయ్యాక కూడా అవే మెరుపులు. అదే సౌంద‌ర్యం. అభిమానులు ఎప్ప‌టికీ ఒక‌లానే ఆరాధిస్తున్నారు. అయితే ఆ అందం ఇక ఇన్‌స్టాగ్ర‌మ్‌లోనూ చేరింది.

ఇక నుంచి రెగ్యుల‌ర్‌గా త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన ఫోటోల్ని, వీడియోల్ని అభిమానుల‌కు ఈ వేదిక‌గా షేర్ చేయ‌నుంది. త‌మ అభిమాన దేవ‌త ఇన్‌స్టాగ్ర‌మ్‌లో చేరిన సంద‌ర్భంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఐస్‌ అభిమానులు సామాజిక‌ ట‌పాసుల్ని కాల్చి త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఏదో కోల్పోయిన ట్విట్ట‌ర్‌కి ఇక జ‌వ‌స‌త్వాలు వ‌చ్చిన‌ట్టే. `ఐశ్వ‌ర్యారాయ్‌బ‌చ్చ‌న్‌-ఏఆర్‌బి పేరుతో ఇన్‌స్టాగ్ర‌మ్ ఖాతాలో నేరుగా ఫోటోలు, వీడియోల్ని వీక్షించే భాగ్యం మ‌న‌కు క‌ల‌గ‌నుంది. అయితే ఐష్‌కి ఈ బుద్ధి పుట్ట‌డానికి కార‌ణం మాత్రం తోటి క‌ళాకారులు, స్నేహితులు.. అభిమానులే. ఇంద‌రి నుంచి ఒత్తిడి వ‌ల్ల‌నే ఇలా ఇన్‌స్టాగ్ర‌మ్‌లో చేరింది ఐష్‌.

User Comments