ఆంటీని చూస్తుంటే ఐస్ అవ్వాల్సిందే

Last Updated on by

పేరు ఐశ్వ‌ర్యారాయ్.. వ‌య‌సు 44.. ఓ బిడ్డ‌కు త‌ల్లి.. ఇన్ని ఉన్న‌పుడు ఖచ్చితంగా ఆమెను ఆంటీ అనాల్సిందే. కానీ ఈ ప‌దానికి పూర్తిగా యాంటీ మ‌న ఐశ్వ‌ర్యారాయ్. ఇండియాలో ఈ పేరు తెలియని వాళ్లంటూ ఉండ‌రు. అందానికి కొల‌మానం ఏంటీ అని అడిగితే ఐష్ అంటారు. ఏ అమ్మాయైనా కాస్త అందంగా ఉందంటే ఐష్ లా ఉన్నావ్ అంటూ ఐస్ చేస్తుంటారు. ఇది తెలిసే విశ్వ‌సుంద‌రి కిరీటం కూడా ఈమె త‌ల‌పై పెట్టేసారు. అది కూడా 24 ఏళ్ల కిందే. అప్ప‌ట్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కేలండ‌ర్ లో ఏళ్లు మారుతున్నాయి కానీ ఈమె అందం మాత్రం అలాగే ఉండిపోయింది. సాధార‌ణంగా 44 ఏళ్లుంటే ఏ హీరోయిన్నైనా హీరోయిన్ అన‌రు.. ఆంటీ అంటారు. కానీ అదేంటో గానీ ఐశ్వ‌ర్యారాయ్ ను చూస్తుంటే మాత్రం ఆంటీ అనాల‌నిపించ‌దు. ఆమె ఇంకో ప‌దేళ్లైనా ఇంకా హీరోయినే.Aishwarya Rai Bachchan Sexiest Femina Photoshootఈమె అందంపై ఎవ‌రికైనా అనుమానం వ‌స్తే తాజాగా ఈమె చేసిన ఫెమీనా ఫోటోషూట్ చూపిస్తే స‌రిపోతుంది. స‌న్న‌గా మారిపోయి మెరుపు తీగకు కూడా కేరాఫ్ అడ్ర‌స్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఐష్ అంటే ఎందుకు అంత‌గా ప‌డిచ‌చ్చిపోతారో ఈ ఫోటోలు చూస్తుంటే అర్థ‌మైపోతుంది. ఇప్ప‌టికీ ఆమెతో న‌టించ‌డానికి కుర్ర హీరోలు ఎందుకు పోటీ ప‌డ‌తారో అర్థ‌మ‌వుతుంది. రెండేళ్ల కింద త‌న‌కంటే వ‌య‌సులో ప‌దేళ్లు చిన్న‌వాడైన ర‌ణ్ బీర్ తో అదిరిపోయే రొమాన్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు కూడా మ‌రో సినిమాకు సిద్ధ‌మ‌వుతుంది ఈ భామ‌. మొత్తానికి ఇటు సినిమాలు అటు ఫోటోషూట్ల‌తో ఇప్ప‌టికీ పిచ్చెక్కిస్తుంది ఐశ్వ‌ర్యారాయ్.Aishwarya Rai Bachchan Sexiest Femina Photoshoot

User Comments