చించి ఆరేసిన ఐష్ ఆంటీ

Last Updated on by

ఉర‌క‌లెత్తే ఉత్సాహానికి వ‌య‌సుతో ప‌నేంటి? మ‌న‌సుండాలేకానీ అస‌లు డ్యాన్స్ చేయ‌డానికి వ‌య‌సు అడ్డంకి ఎలా అవుతుంది? ఇదిగో ఈ వీడియోనే అందుకు ప్ర‌త్య‌క్ష సాక్ష్యం. బ‌చ్చ‌న్‌ల కోడ‌లు, మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ డ్యాన్సింగ్ విన్యాసాలు చూశాక ఈ మాట అనకుండా ఉండ‌లేం. ఒంపుసొంపుల వ‌య్యారాల‌ హంపీ శిల్పం ప్రాణం పోసుకుని న‌ర్తించిందా? అన్నంత అందంగా ఉందీ న‌ర్త‌న‌. అస‌లింత‌కీ ఏ సినిమాలో? అంటే..

ఐశ్వ‌ర్యారాయ్ న‌టిస్తున్న తాజా చిత్రం `ఫ‌నే ఖాన్‌` చిత్రంలో ఐష్‌పై తెర‌కెక్కించిన `మొహ‌బ్బ‌త్` గీతం ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. 40 వ‌య‌సులోనూ ఐష్ హొయ‌లు చూసి కుర్ర‌కారు మ‌తి భ్ర‌మిస్తోందంటే అతిశ‌యోక్తి కాదు. టీనేజీ నుంచి 60వ‌య‌సు ముస‌లాళ్ల వ‌ర‌కూ గుండె ల‌య‌త‌ప్ప గాడి త‌ప్పాల్సిందే ఈ డ్యాన్సులు చూశాక‌. `దూమ్ 2`లో ధూమ్మ‌చాలే అంటూ ఐష్ వేసిన డ్యాన్సుల‌కు కుర్ర‌కారు స్పెల్ బౌండ్ అయిపోయారు. మ‌ళ్లీ అలాంటి ఫీట్ రిపీట్ చేసింది ఈ భామ‌. ఈ పాట‌కు ప్ర‌ఖ్యాత పాప్‌సింగ‌ర్ బియాన్స్ కొరియోగ్రాఫ‌ర్ ఫ్రాంక్ గాట్స‌న్ జూనియ‌ర్ కొరియోగ్రఫీ అందించారు.

User Comments