అజ‌య్ తొలి డ‌బుల్ సెంచ‌రీ..

క్రికెట్ లో డ‌బుల్ సెంచ‌రీ కొట్టిన‌పుడు బ్యాట్స్ మెన్ ఆనందానికి అవధులే ఉండ‌వు. అలాగే ఇండ‌స్ట్రీలో కూడా అంతే. పైగా టీంలో బ్యాటింగ్ ఆర్డ‌ర్ మొత్తం ఫెయిల‌యిన‌పుడు వ‌చ్చి కొట్టే డ‌బుల్ సెంచ‌రీకి ఇంకా విలువ ఎక్కువ‌గా ఉంటుంది. ఇప్పుడు అజ‌య్ దేవ్ గ‌న్ కూడా ఇదే చేసాడు. త‌న తోటి హీరోలంతా చేతులెత్తేసిన చోట వ‌చ్చి 200 కోట్లు వ‌సూలు చేసాడు ఈ హీరో. ఈయ‌న న‌టించిన గోల్ మాల్ అగైన్ ఇండియాలో 200 కోట్ల మార్క్ అందుకుంది. బాలీవుడ్ లో ఈ మార్క్ ఇప్ప‌టి వ‌ర‌కు ఖాన్స్ తో పాటు హృతిక్ రోష‌న్ కు మాత్ర‌మే సాధ్య‌మైంది. తొలిసారి అజ‌య్ దేవ్ గ‌న్ కూడా ఈ మార్క్ అందుకున్నాడు. బాహుబ‌లి 2 త‌ర్వాత గాడిత‌ప్పిన బాలీవుడ్ బాక్సాఫీస్ కు చుక్కానిలా మారింది గోల్ మాల్ అగైన్. ఈ చిత్రం నెమ్మ‌దిగా సాగుతూ సాగుతూ వ‌చ్చి 200 కోట్ల ద‌గ్గ‌ర ఆగింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ వ‌సూళ్లు 250 కోట్ల మార్క్ దాటేసింది.

2006లో వ‌చ్చిన గోల్ మాల్ సిరీస్ లో ఇది నాలుగో భాగం. ఆ త‌ర్వాత గోల్ మాల్.. గోల్ మాల్ రిట‌ర్న్స్.. గోల్ మాల్ 3.. ఇప్పుడు గోల్ మాల్ అగైన్.. అన్నీ సూప‌ర్ హిట్టే. ఆ మ‌ధ్య వ‌ర‌స హిట్లతో జోరు చూపించిన అజ‌య్ దేవ్ గ‌న్.. హిట్ కోసం మ‌రోసారి త‌న పాత స్నేహితున్నే న‌మ్ముకున్నాడు. ఇక్క‌డ రోహిత్ శెట్టి కూడా దిల్ వాలేతో దిమ్మ‌తిరిగే ఫ్లాప్ ఇచ్చి.. ఇప్పుడు గోల్ మాల్ తో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు. మ‌రోవైపు రోహిత్ శెట్టికి ఇది రెండో డ‌బుల్ సెంచ‌రీ. గ‌తంలో షారుక్ ఖాన్ తో చేసిన చెన్నై ఎక్స్ ప్రెస్ 225 కోట్లు వ‌సూలు చేసింది ఇండియాలో. ఇప్పుడు గోల్ మాల్ అగైన్ తో మ‌రోసారి ఆ ఫీట్ అందుకున్నాడు. మొత్తానికి బాలీవుడ్ టైమ్ బాగోలేన‌పుడు వ‌చ్చి ఇండ‌స్ట్రీని బ్యాలెన్స్ చేసారు ఈ స్నేహితులు.