ఆర్ ఆర్ ఆర్ లో ఆ హీరో విల‌న్ కాదంట‌?

`సైరా న‌ర‌సింహారెడ్డి` త‌ర్వాత ఇండియాస్ మెస్ట్ అవైటెడ్ మూవీ గా `ఆర్ ఆర్ ఆర్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. మెగా ప‌వ‌ర్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా న‌టిస్తోన్న భారీ మ‌ల్టీస్టార‌ర‌ర్ ఇప్ప‌టికే ఒక షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ప్ర‌స్తుతం రెండ‌వ షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటోంది. జ‌క్క‌న్న ప‌క్కా ప్లానింగ్ ప్ర‌కారం ముందుకెళ్తున్నాడు. షూటింగ్ కు ఎక్క‌డా అంత‌రాయం క‌ల‌గ‌కుండా అన్ని ముందే స‌మ‌కూర్చుకుని ఓ ప్ర‌ణాళిక ప్ర‌కారం షూటింగ్ చేస్తున్నాడు. అయితే ఇందులో హీరోయిర్లు ఎవ‌రు? తార‌క్, రామ్ చ‌ర‌ణ్ ల‌ను ఢీ కొట్టే ప్ర‌తి నాయ‌కుడు ఎవ‌రు? అన్న దానిపై కొన్ని రూమ‌ర్లు వినిపించాయి.

జ‌క్క‌న్న బాలీవుడ్ నుంచి కిలాడీ అక్ష‌య్ కుమార్ రంగంలోకి దించాల‌ని చూసినా …ఆయ‌న ఆస‌క్తి చూపలేద‌ని… ఈ నేప‌థ్యంలో ఆ చాన్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్ అందుకోబోతున్నాడ‌ని స్పెక్యులేష‌న్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ రూమ‌ర్ల‌పై అజ‌య్ రియాక్ట్ అయ్యాడు. ఆర్ ఆర్ ఆర్ లో న‌టించే అవ‌కాశం త‌న‌కి రాలేద‌ని, త‌నని ఏ టాలీవుడ్ ఫిలిం మేక‌ర్ క‌ల‌వ‌లేద‌ని కుండ బ‌ద్దుల కొట్టేసాడు. అవ‌న్నీ కేవ‌లం గాలి వార్త‌లేన‌ని క్లారిటీ ఇచ్చేసాడు. దీంతో `ఆర్ ఆర్ ఆర్` ఛాన్స్ అజ‌య్ తీసుకోవట్లేద‌ని తేలిపోయింది. ఒక‌వేళ వ‌స్తే న‌టిస్తారా? అన్న దానికి ఆయ‌న స‌రైన బ‌ధులివ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఆర్ ఆర్ ఆర్ విల‌న్ రోల్ పై మ‌రోసారి ఆస‌క్తి సంత‌రించుకుంటోంది.