అజిత్ బ‌ర్త్ డే కు ర‌జినీ గిఫ్ట్..!

Last Updated on by

త‌మిళ‌నాట హీరోల మ‌ధ్య స‌ఖ్య‌త బాగానే ఉంటుంది కానీ అభిమానుల మ‌ధ్య మాత్రం అంత బాగా బంధాలు ఉండ‌వు. అక్క‌డ తేడాలొస్తే చంపేసుకునే అభిమానం ఉంటుంది.. అది పిచ్చిగా కూడా మారుతుంది ఒక్కోసారి. కానీ హీరోల‌కు అవేవీ లేవు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. మే 1న అజిత్ పుట్టిన‌రోజు. ఈయ‌న బ‌ర్త్ డే అంటే అభిమానుల‌కు పండ‌గే. కానీ ఈ సారి ఫ్యాన్స్ కు ఇవ్వ‌డానికి అజిత్ నుంచి గిఫ్టులు ఏమీ రావ‌ట్లేదు. ఎందుకంటే ఈ హీరో కొత్త సినిమా ఈ మ‌ధ్యే మొద‌లైంది. వివేకం ఫ్లాప్ అయినా కూడా మ‌రోసారి శివ‌పై విశ్వాసం ఉంచి విశ్వాసం సినిమా చేస్తున్నాడు. దాంతో అజిత్ సినిమా లుక్స్ ఏవీ రాలేక‌పోయినా.. ఆయ‌న పుట్టిన‌రోజు నాడు ర‌జినీకాంత్ బ‌హుమ‌తి ఇస్తున్నాడు. అదే కాలా పాట విడుద‌ల‌. అవును.. మే 1 సా. 7 గంట‌ల‌కు కాలా తొలిపాట విడుద‌ల కానున్న‌ట్లు అనౌన్స్ చేసాడు నిర్మాత ధ‌నుష్. సినిమా జూన్ 7న రానుంది. ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న సూప‌ర్ స్టార్.. వ‌చ్చిన త‌ర్వాత కాలా ప్ర‌మోష‌న్ లో పాల్గొంటాడు. మొత్తానికి అనుకుని చేస్తున్నారో.. అనుకోకుండా జ‌రిగిందో తెలియ‌దు కానీ అజిత్ బ‌ర్త్ డేకు ర‌జినీ కానుక ఇస్తున్నాడు. ఫుల్ ఆడియో మాత్రం మే 9న విడుదల కానుంది.

User Comments