1000 కోట్ల పెళ్లి: ఈవిడేనా అంబానీ కోడ‌లు?

Last Updated on by

దాదాపు 700 కోట్లు ఖ‌ర్చు చేసి గ‌త ఏడాది చివ‌రిలో కుమార్తె పెళ్లి చేశాడు ముఖేష్ అంబానీ. ఇంత‌లోనే కొడుకు పెళ్లి గురించిన శుభ‌వార్త చెప్పాడు. కూతురు ఇషా అంబానీ అత్తారింటికి వెళ్ల‌గానే, వెంట‌నే కొడుకు పెళ్లికి భాజా మోగించేస్తూ హాట్ టాపిక్ అయ్యాడు ఈ సంపన్నుడు. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత‌గా అంబానీ సాధిస్తున్న ఒక్కో విజ‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. తండ్రిగా ఇప్పుడు పిల్ల‌ల కెరీర్, పెళ్లి బాధ్య‌త‌ల్ని ఆయ‌న నెర‌వేరుస్తున్న తీరుకు అభిమానులు ఏర్ప‌డుతున్నారు.

ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ .. తాను ప్రేమించిన చిన్న నాటి స్నేహితురాలు శ్లోకా మెహ‌తాను పెళ్లాడుతున్నాడు. శ్లోకా మెహ‌తా ప్ర‌ముఖ వ‌జ్రాల వ్యాపారి ర‌స్సెల్ మెహ‌తా కుమార్తె. ఈ జంట వివాహం మార్చి 9న ముంబైలో జ‌ర‌గ‌నుంది. ఇషా అంబానీ- ఆనంద్ పెరుమాళ్ పెళ్లి త‌ర‌హాలోనే మూడు రోజుల పాటు ఈ పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ముంబై- బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వ‌ర‌ల్డ్ సెంట‌ర్‌లో పెళ్లి వెన్యూని ఫిక్స్ చేశారు. ముంబై ట్రిడెంట్ హోట‌ల్ లో బ‌రాత్ కార్య‌క్ర‌మం, జియో సెంట‌ర్ లో మార్చి 9 సాయంత్రం 7.30 ప్రాంతంలో వివాహం జ‌ర‌గ‌నున్నాయని తెలుస్తోంది. ఈ వేడుక‌కు ఏకంగా 500 పైగా ప్ర‌ముఖులు అతిధులుగా విచ్చేయ‌నున్నార‌ట‌. ఇందులో సినీరాజ‌కీయ రంగాలు, పారిశ్రామిక రంగానికి చెందిన ప్ర‌ముఖులు ఉంటారు. ఇక ఈ పెళ్లి వేడుక‌లో ఆకాష్ అంబానీ స్నేహితుడు ర‌ణ‌బీర్ క‌పూర్, అలాగే ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ప్ర‌త్యేక అతిధులుగా ఎటెండ్ కానున్నారు. ఇదివ‌ర‌కూ కుమార్తె ఇషా పెళ్లిలో బాలీవుడ్ సెల‌బ్రిటీలంతా బోలెడు సంద‌డి చేశారు. ఈసారి కూడా అంతే సంద‌డి చేసేందుకు రెడీ కానున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. బిగ్ బిలు, అమితాబ్ లు, క‌పూర్ లు ఈ పెళ్లి వేడుక‌లో సంద‌డి చేస్తార‌న‌డంలో సందేహం లేదు. ఇక ఈ పెళ్లికి ఎంత ఖ‌ర్చ‌వుతుంది? అంటే మ‌రోసారి అంబానీ 1000కోట్లు మినిమం ఖ‌ర్చు చేయ‌డం ఖాయం అనే చెప్పుకుంటున్నారంతా.

User Comments