ర‌జ‌నీని టార్గెట్ చేసిన యువ‌హీరో

Last Updated on by

రామ్‌చ‌ర‌ణ్ `చిరుత‌`తో బాల‌న‌టుడిగా లాంచ్ అయ్యాడు ఆకాష్ పూరి. ప్ర‌భాస్, మ‌హేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంద‌రితో సినిమాలు చేశాడు. అయితే వాళ్ల‌లా అంత పెద్ద స్టార్ అవుతావా? అని ప్ర‌శ్నిస్తే ఏం చెప్పాడో తెలుసా? స్టార్ స్టేట‌స్ కావ‌లంటే క‌ష్ట‌ప‌డాలి. ర‌జ‌నీకాంత్ గారు నాకు రోల్ మోడ‌ల్. ఆయ‌నే నాకు స్ఫూర్తి. చిన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌నంటే చాలా ఇష్టం. హీరోగా ఎదిగేందుకు ఆ స్థాయిలో క‌ష్ట‌ప‌డ‌తాను అని స‌మాధాన‌మిచ్చాడు. మే 11న ఈ సినిమా రిలీజ‌వుతున్న సంద‌ర్భ ంగా పాత్రికేయుల‌తో మాట్లాడిన ఆకాష్ ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని చెప్పాడు.

ఆకాష్ మాట్లాడుతూ-“ చిన్న‌ప్ప‌టి నుంచి ఆర్మీకి వెళ్లాల‌న్నది హీరో క‌ల‌…ఆ త‌ర్వాత ల‌వ్ స్టోరీ చాలా ఆస‌క్తి ని పెంచుతుంది. తొలుత ఆర్మీ పాత్రలో న‌టించాలా? అని చాలా భ‌య‌ప‌డ్డాను. కానీ నా పాత్ర‌ని డిజైన్ చేసిన విధానం బాగుంది. నాన్న‌గారి ప్రోద్భ‌లంతోనే ఈ పాత్ర చేయ‌గ‌లిగాను. అందుకోసం చాలా హోం వ‌ర్క్ చేసాను. జ‌వాన్ లా సెల్యూట్ కొట్ట‌డం ఎలానో చాలా రిసెర్చ్ చేశా. అందుకు చాలా టైమ్ తీసుకున్నాను. సినిమాలో యాక్ష‌న్, ఫైట్స్ ఆక‌ట్టుకుంటాయి. క‌థానాయిక నేహా శెట్టి చాలా బాగా న‌టించింది. నేహా బాగా న‌టించింది… నువ్వు బాగా న‌టించ‌క‌పోతే తేలిపోతావ‌న్నారు. దీంతో నేను కూడా ఆమెకు పోటీగానే న‌టించాను. ఇప్ప‌టికే ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే పాట‌లు పెద్ద హిట్ అయ్యాయి. విజ‌యంపై ధీమాగా ఉన్నాం. మా సినిమాను దిల్ రాజు రిలీజ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. అందుకు ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు“ అని అన్నాడు. మా నాన్న స‌హ‌జంగా కాంప్లిమెంట్ ఇవ్వ‌రు. షూటింగ్ స‌మ‌యంలో సూప‌ర్‌గా చేసావ్‌రా అన్నారు. ఆ మాట నా జీవితాంతం గుర్తుండి పోతుంది అని ఆకాష్ అన్నాడు.

మెహ‌బూబా గురించి చెబుతూ ..“నాన్న‌గారు రాసే ప్రేమ‌క‌థ‌లు చాలా విభిన్న ంగా ఉంటాయి. కానీ ఈ స్టైల్‌లో ప్రేమ‌క‌థ ఉంటుంద‌ని నేను అస్స‌లు ఊహించ‌లేదు. 1971 ఇండో -పాక్ నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థ ఆద్య ంతం ఆస‌క్తి రేకెత్తిస్తుంది“ అని తెలిపాడు. చిన్న‌ప్ప‌టి నుంచి న‌టుడు అవ్వాల‌ని ఉండేది. ఆ పిచ్చితోనే నాన్న‌ను వేషం అడిగేవాడిని. `బుజ్జిగాడు` టైమ్ లో యాక్టింగ్ పెద్ద‌గా తెలియ‌దు. త‌ర్వాత అన్నీ నేర్చుకున్నా. ప్ర‌తీ సినిమాకు నేర్చుకుంటూనే ఉంటాను..అని ఆకాష్ తెలిపాడు.

User Comments