అఖిల్ టైటిల్ ఫిక్స్‌?

Last Updated on by

అక్కినేని చియాన్ అఖిల్ ప్ర‌స్తుతం వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో త‌న కెరీర్ మూడో చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిధి అగ‌ర్వాల్ అఖిల్ స‌ర‌స‌న‌ క‌థానాయిక‌గా ఆడిపాడుతోంది. `అత్తారింటికి దారేది` నిర్మాత బివిఎస్ఎన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ సినిమా టైటిల్‌ని అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. అయితే ఈనెల 29న కింగ్ నాగార్జున పుట్టిన‌రోజున లేదా అంత‌కంటే ముందే అఖిల్3 టైటిల్‌ని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

అస‌లింత‌కీ టైటిల్ ఏమై ఉంటుంది? అంటే.. `Mr. మ‌జ్ను` అనే టైటిల్ ఫిలింస‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. కింగ్ నాగార్జున న‌టించిన మ‌జ్ను అప్ప‌ట్లో క్లాసిక‌ల్ హిట్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. గొప్ప‌ ప్రేమికుడిగా న‌టించిన‌ నాగార్జున‌కు దేవ‌దాసు అంత బాగా న‌టించార‌న్న పేరొచ్చింది. ఇప్పుడు అఖిల్ న‌టిస్తున్న‌ది పూర్తి స్థాయి ప్రేమ‌క‌థా చిత్రం కాబ‌ట్టి ఈ టైటిల్ యాప్ట్‌గా ఉంటుంద‌ని భావిస్తున్నారు. ష్యూర్‌షాట్‌గా ఈసారి హిట్ కొట్టాల్సిన సంద‌ర్భం. డిసెంబ‌ర్‌లో క్రిస్మ‌స్ కానుక‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. త‌మ‌న్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు.

User Comments