అఖిల్- 4 రొమాంటిక్ కామెడీ?

Akhil Looking For Star Directors?

Last Updated on by

పాస్ట్ ఈజ్ పాస్ట్. గ‌తాన్ని మ‌ర‌చి భ‌విష్య‌త్ ను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ల‌డ‌మే. అఖిల్ ఇప్పుడు అదే చేస్తున్నాడు. అక్కినేని వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కు మూడు సినిమాలు చేదు అనుభ‌వాన్నే మిగిల్చాయి. ప్ర‌స్తుతం నాల్గ‌వ సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తో త‌న నాల్గ‌వ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే స్ర్కిప్ట్ లాక్ అయింది. గీతా ఆర్స్ట్ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. అర‌వింద్ గారి ల‌క్కీ హ్యాండ్ ద్వారానైనా త‌న‌యుడు హిట్ అందుకోవాల‌ని నాగార్జున అత‌ని చేతుల్లో పెట్టారు. ఇక బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ప్ర‌తిభ‌ను, సృజ‌నాత్మ‌క‌త‌ను గుర్తించిన సంస్థ అఖిల్ కి అత‌నైతేనే క‌రెక్ట్ అనిభావించి ముంద‌కెళ్తోంది.

ప్లాప్ ల‌తో కొన్నాళ్ల పాటు ప‌రిశ్ర‌మ‌కు దూరంగా ఉన్న భాస్క‌ర్ తో అఖిల్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాల‌ని ఎంతో క‌సితో క‌థ సిద్దం చేసి వ‌స్తున్నాడు. తాజాగా ఈ సినిమా రొమాంటిక్ కామెడీ జోన‌ర్ అని స‌మాచారం. ఈజోన‌ర్ క‌థ‌లు తెలుగు ఆడియ‌న్స్ కొత్తేం కాదు. కాక‌పోతే ఏ క‌థ‌నైనా తెర‌పై ఆవిష్క‌రించ‌డాన్ని బ‌ట్టే ఉంటుంది. మేక‌ర్ గా భాస్క‌ర్ కు మంచి గుర్తింపు ఉంది కాబ‌ట్టి రొటీన్ కథే అయినా కొత్త‌గా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తాడ‌న‌డంలో సందేహం లేదు. అందుకే `ఒంగోలు గిత్త` విడుద‌లై 5 ఏళ్లు అయినా..అఖిల్ తో ఛాన్స్ అందుకుని ఔరా అనిపించాడు.

Also Read: Telugu News Channels And Their Political Inclinations


Related Posts