అఖిల్.. తండ్రికి ఛాలెంజ్ విసిరాడు

Last Updated on by

Last updated on May 25th, 2018 at 04:11 am

ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూనే ఉండాలి లేక‌పోతే వెన‌క‌బ‌డిపోతుంటారు రేస్ లో. ఇప్పుడు అఖిల్ కూడా ఇదే చేస్తున్నాడు. ఇండియాలో ఇప్పుడు హ‌మ్ ఫిట్ తో ఇండియా ఫిట్ అనే ఓ ఛాలెంజ్ న‌డుస్తుంది. అంటే అప్ప‌ట్లో ఐస్ బ‌కెట్ ఛాలెంజ్ టైప్ లో అన్న‌మాట‌. నువ్వు ఫిట్ గా ఉంటే ఇండియా కూడా ఉంటుందని దీని అర్థం. ఎవ‌రైనా స‌రే త‌మ ఫిట్ నెస్ చూపించి.. మ‌రికొంద‌రికి ఛాలెంజ్ విస‌రాలి. ఈ లిస్ట్ లో ఇప్పుడు పివి సింధూ అఖిల్ కు ఈ స‌వాల్ విసిరింది. దాన్ని స్వీక‌రించిన అఖిల్.. ఫిట్ నెస్ చూపించి ఇప్పుడు మ‌రో న‌లుగురికి అది విసిరాడు.

అందులో నాగార్జున‌తో పాటు నాగ‌చైత‌న్య‌, వ‌రుణ్ ధావ‌న్, దుల్క‌ర్ స‌ల్మాన్ ఉన్నారు. మ‌రి ఈ న‌లుగురు ఛాలెంజ్ ను స్వీక‌రిస్తారో లేదో చూడాలి..! ఇక ఇక్క‌డ మ‌రో చిత్రం కూడా జ‌రిగింది. ఈ ఫిట్ నెస్ ఛాలెంజ్ లో మోడి కూడా ఉన్నాడు. ఇండియ‌న్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ ఛాలెంజ్ ను ఏకంగా మోడికే ఇచ్చాడు. దాన్ని మోడి స్వీక‌రించాడు కూడా.

https://twitter.com/AkhilAkkineni8/status/999300681814044672

User Comments