అఖిల్ గొడవ పడడం నిజమే

Last Updated on by

ఏ సినిమాకైనా ద‌ర్శ‌కుడు, హీరో మ‌ధ్య గొడ‌వ వ‌చ్చింద‌ని రూమ‌ర్ వ‌స్తే ఏదో ఒక‌టి చేసి దాన్ని త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తారు. అవేవీ ప‌ట్టించుకోకుండా త‌మ ప‌ని తాము చేసుకుంటారు. కానీ ఇక్క‌డ అఖిల్ మాత్రం త‌న సినిమాకు దాన్నే ప్ర‌మోష‌న్ కింద వాడుకున్నాడు. ఈయ‌న కొన్ని రోజులుగా లండ‌న్ లోనే ఉన్నాడు. వెంకీ అట్లూరితో ఈయ‌న చేస్తోన్న సినిమా షూటింగ్ లండ‌న్ లో నాన్ స్టాప్ గా జ‌రుగుతుంది. మ‌రో రెండు నెల‌లు అక్క‌డే షూట్ చేయ‌బోతున్నాడు వెంకీ అట్లూరి. అఖిల్, నిధి అగర్వాల్ తో పాటు చిత్ర‌యూనిట్ కూడా ఈ షెడ్యూల్ లో ఉన్నారు. సీనియ‌ర్ న‌టీన‌టులు ఈ చిత్రంలో అఖిల్ తో న‌టిస్తున్నారు. తొలిప్రేమ త‌ర‌హాలోనే ఇది కూడా ప్యూర్ ల‌వ్ స్టోరీ. స‌వ్య‌సాచిలో అన్న చైతూతో జోడీక‌ట్టిన నిధి.. ఇప్పుడు వెంకీ సినిమాలో త‌మ్ముడు అఖిల్ తో రొమాన్స్ చేస్తుంది.

ఈ సినిమా జ‌రుగుతున్న టైమ్ లోనే అఖిల్, వెంకీకి మ‌ధ్య క్రియేటివ్ డిఫెరెన్సులు వ‌చ్చాయ‌నే ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై స్పందించిన హీరో, ద‌ర్శ‌కుడు ఓ స్పూఫ్ వీడియో చేయ‌డం విశేషం. త‌మ‌కు గొడ‌వ ఉంద‌ని నెట్ లో వ‌చ్చింద‌ని.. అది నిజ‌మే అని చెప్పాడు. ఇందులో కూడా సెటైర్లు ప‌డ్డాయి. నువ్ మాట్లాడు అంటే.. లేదు హీరో క‌దా ముందు నువ్వే మాట్లాడు అంటూ ఒక‌రిపై ఒక‌రు సెటైర్లు వేసుకున్నారు. ఆ త‌ర్వాత న‌వ్వేసి వెంకీకి ముద్దు పెట్టి పారిపోయాడు అఖిల్. దీనివ‌ల్ల సినిమాకు కూడా చాలా ప్ర‌మోష‌న్ వ‌చ్చిన‌ట్లైంది. లండ‌న్ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ 70 శాతం పూర్తి కానుంది. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ లో చిన్న షెడ్యూల్ ప్లాన్ చేసాడు. ద‌స‌రాకు విడుద‌ల కానుంది ఈ చిత్రం.

User Comments