పాపం అఖిల్ కు ఏం తెలియ‌దట..!

Last Updated on by

ఏ హీరో అయినా త‌ర్వాతి సినిమా ఏంటి అని అడిగితే ఇప్పుడే కాదు త‌ర్వాత చెప్తా అనో.. లేదంటే ఇంకా ఫైనల్ కాలేద‌నో చెప్తారు కానీ అఖిల్ మాత్రం అద్భుతం. విచిత్రంగా నాకేం తెలియ‌దు అని స‌మాధానం ఇచ్చాడు. ఈయ‌న తాజాగా మౌంటెన్ డ్యూ యాడ్ కోసం ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నాడు. ఈ వేడుక‌కు వ‌చ్చిన అఖిల్ ను మీడియా కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌లు అడిగింది. అందులో ముఖ్యంగా వ‌చ్చేది వ‌ర్మ‌తో మీ సినిమా ఎప్పుడు.. ఏంటి అని..? అస‌లే ఆఫీస‌ర్ కంగారులో ఉన్న అక్కినేని బుల్లోడికి ఈ ప్ర‌శ్న‌లు మ‌రింత టెన్ష‌న్ తెప్పించాయి. దాంతో కంగారులో నాకేం తెలియ‌దు.. న‌న్నేం అడ‌క్కండి అంటూ అక్క‌డ్నుంచి వెళ్లిపోయాడు. స‌మ‌యం వ‌చ్చిన‌పుడు అన్నీ చెప్తానంటూ చిన్న‌సైజ్ వేదాంతం కూడా మాట్లాడాడు.

వ‌ర్మ దెబ్బ‌కు క‌నీసం వెంకీ అట్లూరి సినిమాపై కూడా ఎలాంటి క‌మెంట్స్ చేయ‌లేదు అఖిల్. అంత‌గా భ‌య‌ప‌డ్డాడు పాపం ఈ పిల్లోడు ఆఫీస‌ర్ చూసి. ఈ సినిమా ఫలితం చూసిన త‌ర్వాత నాగార్జున కూడా ఇప్ప‌ట్లో వ‌ర్మ పేరు ఎత్త‌డానికి భ‌య‌ప‌డుతున్నాడు. ఫ్లాపులు రావ‌డం కామ‌న్ కానీ ఆఫీస‌ర్ లాంటి అరాచ‌కం రావ‌డం మాత్రం పుష్క‌ర కాలానికి ఒక్క‌టే. దాంతో వ‌ర్మ లాంటి క‌ర్క‌ష‌మైన చేతుల్లో అఖిల్ లాంటి సుకుమారున్ని పెడితే న‌ల‌ప‌డం ఖాయం అని ముందే అర్థం చేసుకున్నాడు నాగార్జున‌. అందుకే త‌న‌యుడి విష‌యంలో ఓ నిర్ణ‌యం తీసుకున్నాడు. దాంతో అఖిల్ కూడా వ‌ర్మ‌తో సినిమాపై వెన‌క‌డుగు వేసాడు. ప్ర‌స్తుతం వెంకీ సినిమాపై దృష్టి పెట్టాడు ఈ హీరో.

User Comments