పోలాండ్ పోర‌డితో అఖిల్..

Last Updated on by

అఖిల్ ప్ర‌స్తుతం మూడో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈయ‌న చిత్ర షూటింగ్ లండ‌న్ లో నాన్ స్టాప్ గా జ‌రుగుతుంది. మ‌రో రెండు నెల‌లు అక్క‌డే షూట్ చేయ‌బోతున్నాడు వెంకీ అట్లూరి. అఖిల్, నిధి అగర్వాల్ తో పాటు చిత్ర‌యూనిట్ కూడా ఈ షెడ్యూల్ లో ఉన్నారు. సీనియ‌ర్ న‌టీన‌టులు ఈ చిత్రంలో అఖిల్ తో న‌టిస్తున్నారు. తొలిప్రేమ త‌ర‌హాలోనే ఇది కూడా ప్యూర్ ల‌వ్ స్టోరీ. స‌వ్య‌సాచిలో అన్న చైతూతో జోడీక‌ట్టిన నిధి.. ఇప్పుడు వెంకీ సినిమాలో త‌మ్ముడు అఖిల్ తో రొమాన్స్ చేస్తుంది. అయితే ఈ చిత్ర సెట్స్ కి అనుకోని అతిథి వ‌చ్చాడు. అత‌డి పేరు జిబిగ్నూ.

Akhil akkineni

Akhil akkineni met Poland bujji

సాధార‌ణంగా ఈ పేరంటే ఎవ‌రికి తెలియ‌దు. కానీ పోలాండ్ పోర‌డు అంటే మాత్రం ఇట్టే గుర్తు ప‌డ‌తారు. తెలుగులో ఏ కొత్త పాట వ‌చ్చినా కూడా త‌న‌కు వ‌చ్చీ రాని తెలుగులో ముచ్చ‌టగా పాడుతుంటాడు ఈ కుర్రాడు. యూ ట్యూబ్ లో ఇప్ప‌టికే సెన్సేషన్ అయిపోయాడు జిబిగ్నూ. ఇప్పుడు ఈ కుర్రాడే అఖిల్ సినిమా సెట్ లో క‌నిపించాడు. ద‌ర్శ‌కుడు.. హీరో.. హీరోయిన్ తో క‌లిసి పోటోల‌కు పోజిచ్చాడు జిబిగ్నూ. ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల కానుంది. బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌. తొలి రెండు సినిమాల‌తో ఫ్లాపులిచ్చిన అఖిల్ కు మూడో సినిమా కీల‌కంగా మారింది.

zbigniew

User Comments