జ‌న‌వ‌రిలో `మిస్ట‌ర్ మ‌జ్ను`

Last Updated on by

అక్కినేని మిసైల్ అఖిల్ న‌టిస్తున్న మూడ‌వ చిత్రం `మిస్ట‌ర్ మ‌జ్ను`. `బోయ్స్ విల్ బి బోయ్స్‌` అనేది ఉప‌శీర్షిక‌. `తొలి ప్రేమ‌` ఫేం వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీచిత్ర ప‌తాకంపై బివిఎస్‌ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. దీపావ‌ళి కానుక‌గా తాజాగా ఓ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసింది చిత్ర‌బృందం.

ఈ పోస్ట‌ర్‌లో అక్కినేని అఖిల్ స్టైల్ యువ‌త‌రాన్ని హ‌త్తుకునేలా ఉంది. క్యాప్ష‌న్ కి త‌గ్గ‌ట్టే కుర్రాళ్లు కుర్రాళ్లే అన్నంత పెప్పీగా పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది. కెరీర్ ఆరంభ‌మే రెండు ఫ్లాప్‌లు త‌న‌ని ఇబ్బంది పెట్టినా ఎక్క‌డా ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా అఖిల్ ఎంతో శ్ర‌మిస్తున్నాడు. ముచ్చ‌ట‌గా మూడో ప్ర‌య‌త్నం.. ఈసారి ఎట్టిప‌రిస్థితిలో విజ‌యం ద‌క్కించుకోవాల‌న్న క‌సి అత‌డిలో క‌నిపిస్తోంది. అక్కినేని బ్రాండ్ రొమాంటిక్ కామెడీనే ఈసారి అఖిల్ ఎంపిక చేసుకున్నాడు. ఈ చిత్రంలో మ‌గువ‌ల గుండెల్లో గుబులు రేకెత్తించే రోమియో త‌ర‌హా పాత్ర‌లో అఖిల్ న‌టిస్తున్నాడ‌ని ఇదివ‌ర‌కూ రిలీజైన టీజ‌ర్ చూస్తే అర్థ‌మైంది. జ‌న‌వ‌రిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. కొత్త సంవ‌త్స‌రంలో అఖిల్ అభిమానుల‌కు ట్రీట్ ఖాయ‌మైంది. నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో నాగ‌బాబు, ప్రియ‌ద‌ర్శిని, జ‌య‌ప్ర‌కాష్‌, హైప‌ర్ ఆది త‌దిత‌రులు న‌టిస్తున్నారు. జార్జి సి విలియ‌మ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త‌మన్ సంగీతం అందిస్తున్నారు.

User Comments