సినిమాలు చేయవా రాజా..!

Last Updated on by

అఖిల్ కు క్రికెట్ అంటే పిచ్చి అని తెలుసు.. కానీ అది ఇప్పుడు మ‌రో లెవ‌ల్ కు వెళ్లిపోయింది. ఈయ‌న‌కు సినిమాలు ముఖ్య‌మా.. క్రికెట్ ముఖ్య‌మా అంటే ఇప్పుడు మ‌రో మాట లేకుండా క్రికెట్ అనేలా ఉన్నాడు. ఓ వైపు హ‌లో కూడా ఫ్లాప్ అయి కొడుకును ఎలా నిల‌బెట్టాలా అని నాగార్జున ఫీల్ అవుతుంటే.. అఖిల్ మాత్రం హాయిగా క్రికెట్ ఆడుకుంటున్నాడు. అది కూడా జిల్లా స్థాయి ఆట‌గాళ్ల‌తో. వెంక‌ట‌స్వామి క్రికెట్ లీగ్ ఈ మ‌ధ్యే మొద‌లైంది. అన్ని జిల్లాల ఆట‌గాళ్లు ఇందులో ఆడుతున్నారు. వీళ్ళ‌లో అఖిల్ కూడా క‌లిసిపోయాడు.

రంగారెడ్డి జిల్లా త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు అక్కినేని వార‌సుడు. త‌న స్థాయి మ‌రిచిపోయి ఇలా చిన్న ఆట‌గాళ్ళ‌తో క‌లిసి అఖిల్ ఆడుతుండ‌టం అభిమానుల‌కు కూడా న‌చ్చ‌డం లేదు. క్రికెట్ అంటే ఎంత పిచ్చి ఉన్నా కూడా ఇలా సినిమాలు కూడా మానేసి ఆడుకోవ‌డం ఏంటంటున్నారు ఫ్యాన్స్. ఒక్క హిట్ కొడితే వ‌చ్చే కిక్ కంటే ఒక్క సిక్స్ కొడితే వ‌చ్చే కిక్ ఎక్కువ అనుకుంటున్నాడు అఖిల్. అందుకే నాగార్జున కూడా అఖిల్ కు అడ్డు చెప్ప‌డం లేదు. ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోల‌కు క్రికెట్ అంటే పిచ్చి ఉంది కానీ అఖిల్ రేంజ్ లో అయితే కాదు. ఈయ‌న తీరు చూస్తుంటే ఫ్యూచర్ లో సినిమా కోసం క్రికెట్ వ‌దిలేసినా వ‌దిలేసేలా క‌నిపిస్తున్నాడు.

User Comments